కలబందతో హెయిర్ గ్రోత్ సీరం ఎలా తయారు చేసుకోవాలో తెలుసా..?
TeluguStop.com
సాధారణంగా కొందరికి జుట్టు ఎదుగుదల( Hair Growth ) అనేది సరిగ్గా ఉండదు.
ఎంత ఖరీదైన ఆయిల్స్ వాడినప్పటికీ ఫలితం మాత్రం అంతంత మాత్రంగానే ఉంటుంది.పైగా జుట్టు ఎదుగుదల లేకపోవడం, ఉన్న జుట్టు ఊడిపోవడం వల్ల కురులు పల్చగా మారిపోతాయి.
మీరు కూడా ఈ సమస్యను ఫేస్ చేస్తున్నారా? అయితే అస్సలు వర్రీ అవ్వకండి.
కలబందతో( Aloevera ) ఇప్పుడు చెప్పబోయే హెయిర్ గ్రోత్ సీరం ను తయారు చేసుకుని వాడితే వద్దన్నా కూడా మీ జుట్టు దట్టంగా పెరుగుతుంది.
మరి ఇంకెందుకు ఆలస్యం సీరంను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి. """/" /
ముందుగా ఒక కలబంద ఆకును తీసుకుని వాటర్ తో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
ఆ తర్వాత మిక్సీ జార్ లో కట్ చేసుకున్న కలబంద ముక్కలు మరియు ఒక కప్పు కొబ్బరి నూనె( Coconut Oil ) వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి సాస్ పాన్ పెట్టి అందులో గ్రైండ్ చేసుకుని మిశ్రమాన్ని వేసి దాదాపు 8 నిమిషాల పాటు ఉడికించాలి.
ఆపై అందులో నాలుగు ఎండిన మందారం పువ్వులు( Dry Hibiscus ) మరియు వన్ టేబుల్ స్పూన్ మెంతులు( Fenugreek ) వేసి మరొక ఆరేడు నిమిషాల పాటు ఉడికిస్తే మన సీరం దాదాపు సిద్ధమవుతుంది.
"""/" /
స్టవ్ ఆఫ్ చేసుకుని ఉడికించిన మిశ్రమాన్ని చల్లారబెట్టుకోవాలి.పూర్తిగా కూల్ అయ్యాక స్టైనర్ సహాయంతో సీరంను ఫిల్టర్ చేసుకోవాలి.
ఈ అలోవెరా హెయిర్ గ్రోత్ సీరంను స్కాల్ప్ తో జుట్టు మొత్తానికి అప్లై చేసుకుని నాలుగు గంటల తర్వాత లేదా మరుసటి రోజు తేలిక పాటి షాంపూను ఉపయోగించి తలస్నానం చేయాలి.
వారానికి ఒకసారి ఈ విధంగా చేశారంటే జుట్టు ఒత్తుగా, పొడుగ్గా పెరుగుతుంది.కురులకు చక్కని పోషణ అందుతుంది.
హెయిర్ రూట్స్ స్ట్రాంగ్ గా మారతాయి.జుట్టు రాలడం విరగడం తగ్గుతాయి.
అలాగే ఈ కలబంద సీరం ను వాడడం వల్ల చుండ్రు సమస్య దూరం అవుతుంది.
స్కాల్ప్ హైడ్రేట్ గా మరియు హెల్తీగా మారుతుంది.
వీడియో: డబ్బాలో తల ఇరుక్కుని హిమాలయన్ ఎలుగుబంటి విలవిల.. రక్షించిన ఇండియన్ ఆర్మీ..