బాహుబలి తో మొదలైన టాలీవుడ్ హావ హిందీ సినిమాలను చతికల పడేలా చేశాయి.ట్రిపుల్ ఆర్, పుష్ప, కార్తికేయ 2 సినిమాలు సౌత్ నుంచి బాలీవుడ్ కి వెళ్లి హిందీ సినిమాలకు అంత సీన్ లేదు అంటూ నంబర్ 2 కి పడేశాయి.
కానీ ఆ ఆనందం ఎక్కువ రోజులు నిలవలేదు.వరసపెట్టి పెద్ద సినిమాలు పరాజయం పొంది తెలుగు సినిమా రేంజ్ ని 2023 లో తగ్గించేసాయి.
ఈ ఏడాది టాప్ 3 సినిమాలు హిందీ నుంచే వచ్చాయి.ఇక ఇదే బెస్ట్ టైం అన్నట్టుగా షారుక్( Shahrukh Khan ) వరస హిట్స్ కొట్టి బాలీవుడ్ ఆశలను సజీవంగా ఉంచాడు.
గదర్ 2( Gadar 2 ) కూడా మంచి కలెక్షన్స్ సాధించి బాక్స్ ఆఫీస్ దుమ్ము దులిపింది.ఆ టైంలోనే తెలుగు సినిమాలు గండి కొట్టడం తో నంబర్ 2 సరి పెట్టుకున్నారు.
అయితే ఇక మీదట ఆ అవకాశం లేదు అంటున్నారు మన తెలుగు హీరోలు.ఈ ఏడాది ఎలాగూ పోయింది కానీ వచ్చే ఏడాది మళ్లి నంబర్ వన్ కి రీచ్ అవ్వడం పక్క అంటున్నారు.మరి అంత కాన్ఫిడెంట్ ఎందుకు అంటే మన ఫ్యాన్ ఇండియా సినిమాల లైనప్ ఆలా ఉంది మరి అంటూ ఫుల్ జోష్ లో ఉన్నారు.ఇంతకు తెలుగు ను మళ్లి నంబర్ వన్ చేసే ఆ సినిమాలు ఏంటో ? ఈ వివరాలను ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.2024 లో ప్రభాస్( Prabhas ) నటిస్తున్న మూడు సినిమాలు విడుదల కాబోతుండటం తో మరోసారి మన మ్యాజిక్ ఫ్యాన్ ఇండియా లో కనిపించబోతుంది.ప్రాకేక్ట్ కే,( Project K ) సలార్ సీక్వెల్,( Salaar Sequel ) రాజా డీలక్స్ ( Raja Deluxe ) వంటి మూడు సినిమాలు థియేటర్లలో సందడి చేయబోతున్నాయి.1500 కోట్ల మార్కెట్ తో ఈ మూడు సిద్ధం అవుతన్నాయి.
ఇప్పటికే పుష్ప తో తన స్టామినా చూపించిన అల్లు అర్జున్ పుష్ప సీక్వెల్ తో ( Pushpa 2 ) రాబోతున్నాడు.దీనికి ఒక్క తెలుగులోనే 300 కోట్ల మార్కెట్ జరిగింది.ట్రిపుల్ ఆర్ హీరో తారక్ దేవర చిత్రంతో( Devara ) దూసుకస్తున్నాడు.
అలాగే మరొక హీరో రామ్ చరణ్ సైతం గేమ్ చెంజర్( Game Changer ) సినిమా తో హిందీ లో థియేటర్స్ లో మోత మోగించబోతున్నాడు.ఇక పవన్ కళ్యాణ్ OG విజయ్ దేవరకొండ మరియు గౌతమ్ తిన్ననూరి ప్రాజెక్ట్స్ కూడా మేమేం తక్కువ తినలేదు అంటూ ఫ్యాన్ ఇండియా మూవీస్ గా తెరకెక్కుతున్నాయి.
ఇవన్నీ వర్క్ అవుట్ అయితే 2024 మళ్లి నంబర్ వన్ స్థానం మనదే.