టాలీవుడ్ పాన్ ఇండియా హీరో జూనియర్ ఎన్టీఆర్ ( Hero Junior NTR )ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే.అందులో భాగంగానే ఇటీవల దేవర మూవీతో ప్రేక్షకులను పలకరించారు.
భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది.ఇప్పుడు అదే ఊపుతో మరిన్ని సినిమాలలో నటిస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్.
ఇందులో భాగంగానే హృతిక్ రోషన్( Hrithik Roshan ) హీరోగా నటిస్తున్న వార్ 2( War 2 ) సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమా విడుదల ఇంకో ఎనిమిది నెలల్లో జరగనుంది.
ఆగస్ట్ 14 తేదీని ఇంతకు ముందే ప్రకటించడంతో దానికి అనుగుణంగా షూటింగ్ వేగంగా పూర్తి చేస్తున్నారు.
ఇంకొంచెం ప్యాచ్ వర్క్, సాంగ్ తప్ప దాదాపు అయిపోయినట్టేనని బాలీవుడ్ టాక్.ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్లు ఈ సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి.
ఇకపోతే ఈ సినిమాలో తారక్, హృతిక్ రోషన్ కాంబోలో ఇందులో ఒక పాట ఉంది.అది కూడా డాన్స్ నెంబర్.ఆర్ఆర్ఆర్ సినిమాను ఆస్కార్ దాకా తీసుకెళ్లిన నాటు నాటు స్థాయిని మించి కంపోజ్ చేస్తున్నారని గతంలోనే లీక్స్ వచ్చాయి.అయితే అది ఎంత ఛాలెంజింగ్ గా ఉంటుందో హృతిక్ రోషన్ తన మాటల్లోనే వివరించాడు.
కాగా హృతిక్ రోషన్ డెబ్యూ మూవీ కహో నా ప్యార్ హై పాతిక సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జనవరి 10 రీ రిలీజ్ చేశారు.
అతి పెద్ద బ్లాక్ బస్టర్స్ గా అప్పట్లో ఇది సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు.ఒక్క సినిమాకే ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు హృతిక్.అమ్మాయిలు వెర్రెక్కిపోయేలా అభిమానించడం మొదలుపెట్టారు.
నిర్మాతలు డేట్ల కోసం క్యూ కట్టారు.ఆడియో క్యాసెట్ల అమ్మకాలతో రికార్డులు బద్దలయ్యాయి.
ఇక థియేటర్ల జాతర గురించి చెప్పనక్కర్లేదు.దీని ప్రమోషన్లలో భాగంగా అభిమానులతో నేరుగా జరిపిన చిట్ ఛాట్ లో వార్ 2 గురించి ఒక ముఖ్యమైన విషయం పంచుకున్నాడు.
ఈ మేరకు హృతిక్ రోషన్ మాట్లాడుతూ.ఒక బలమైన సాంగ్ చేయడం కోసం సిద్ధమవుతున్నాను.
నా కాళ్ళు బలంగా ఉండాలని కోరుకుంటున్నాను.ఆ పోటీలో నిలిచేందుకు సంసిద్ధమవుతున్నాను అని తెలిపారు హృతిక్ రోషన్.
ఈ సందర్భంగా హృతిక్ రోషన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.జూనియర్ ఎన్టీఆర్ తో డాన్స్ చేయడం అన్నది తనకు చాలెంజింగ్ విషయం అని తన మాటల ద్వారా తెలిపారు హృతిక్ రోషన్.
ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.