గంగోత్రి సినిమాతో మొదలుపెట్టిన అల్లు అర్జున్ సినీ ప్రయాణం నేడు పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్థాయికి చేరింది.అల్లు అర్జున్ తన కెరియర్లో అనేక మంది హీరోయిన్స్ ని తన సినిమాల ద్వారా ఇండస్ట్రీకి పరిచయం చేశాడు.
కానీ బయట ప్రపంచానికి తెలియని విషయం ఏంటంటే ఆయన పరిచయం చేసిన ప్రతి హీరోయిన్ తో ఒక బ్యాడ్ సెంటిమెంటు కంటిన్యూ అవుతుంది.అల్లు అర్జున్ సెంటిమెంట్ కారణం కావచ్చు లేదో కానీ బన్నీ పరిచయం చేసిన హీరోయిన్స్ అందరూ కూడా ఫ్లాప్ హీరోయిన్స్ అనే ముద్ర వేసుకున్నారు.అలా అల్లు అర్జున్ బ్యాడ్ సెంటిమెంట్ కి బలైపోయిన ఆ హీరోయిన్స్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
అతిథి అగర్వాల్
ఆర్తి అగర్వాల్ చెల్లెలు అదితి బన్నీ మొదటి సినిమా గంగోత్రితో హీరోయిన్ గా పరిచయం అయింది.కానీ పేలవమైన యాక్టింగ్ తో రెండు మూడు సినిమాలు తర్వాత ఇండస్ట్రీ నుంచి కనుమరుగయ్యింది.
గౌరీ ముంజల్
వివి వినాయక దర్శకత్వంలో బన్నీ హీరోగా నటించిన సినిమా బన్నీ గౌరీ ముంజల్ హీరోయిన్ గా ఈ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయింది.ఆ తర్వాత కొన్ని సినిమాలకే ఆమె ఇండస్ట్రీ నుంచి ఫెడవుట్ అయింది.
అనురాధ మెహతా
అల్లు అర్జున్ కెరీర్ లోనే ఆర్య సినిమా ఎంత పెద్ద హిట్ అన్న విషయం మన అందరికీ తెలిసిందే.ఈ సినిమా ద్వారా అనురాధ తొలిసారి హీరోయిన్గా పరిచయం అయింది ఆ తర్వాత హిట్ సినిమాలు లేకపోవడంతో ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోయింది.

భాను శ్రీ మెహ్రా
వరుడు సినిమాతో భాను శ్రీ మెహ్రా ని హీరోయిన్ గా పరిచయం చేశాడు అల్లు అర్జున్ కానీ ఆ సినిమా తర్వాత ఆమె మళ్ళీ ఏ సినిమాలను నటించలేదు.
షీలా
అల్లు అర్జున్ నటించిన పరుగు సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది షీలా ఆ తర్వాత కెరియర్ లో నిలదొక్కుకోలేక ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోయింది.

దీక్ష సేథ్
అల్లు అర్జున్ దీక్ష జంటగా నటించిన సినిమా వేదం ఈ సినిమా తర్వాత దీక్ష అనేక సినిమాల్లో నటించిన ఆమెకు సరైన హిట్ అయితే దొరకలేదు దాంతో ఇండస్ట్రీ నుంచి కనుమరుగైపోయింది.







