చర్మ ఛాయను పెంచుకునేందుకు ఏవేవో క్రీములు వాడుతుంటారు.ఎన్నో ఫేస్ ప్యాకులు వేసుకుంటారు.
బ్యూటీ పార్లర్స్ చుట్టూ తిరుగుతూ ఫేషియల్స్ చేయించుకుంటారు.కానీ, ఎలాంటి ఖర్చు లేకుండా మామిడి తొక్కలతో ఇంట్లోనే చర్మ ఛాయను పెంచుకోవచ్చన్న విషయం మీకు తెలుసా.? అవును, మీరు విన్నది నిజమే.మామడి తొక్కలు చర్మ ఛాయను పెంచగలవు.
చాలా మంది మామడి తొక్కలను వేస్ట్‌గా భావించి డస్ట్ బిన్‌లోకి తోసేస్తుంటారు.అయితే వాస్తవానికి మామిడి తొక్కల్లోనూ ఎన్నో పోషక విలువలు దారి ఉంటాయి.
అవి చర్మానికి ఎంతో మేలు చేస్తాయి.మరి మామిడి తొక్కలను చర్మానికి ఎలా యూజ్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా మామిడి తొక్కలను ఎండలో బాగా ఎండబెట్టి మెత్తగా పొడి చేసుకోవాలి.ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో ఒక స్పూన్ మామిడి తొక్కల పొడి, అర స్పూన్ ముల్తానీ మట్టి, రెండు స్పూన్ల రోజ్ వాటర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు అప్లై చేసుకుని ఇరవై లేదా ముప్పై నిమిషాల అనంతరం గోరు వెచ్చని నీటితో క్లీన్ చేసుకోవాలి.ఇలా రెండు రోజుకు ఒక సారి చేస్తుంటే చర్మ ఛాయ క్రమంగా పెరుగుతుంది.
అలాగే ఒక గిన్నెలో ఒక స్పూన్ చప్పున మామిడి తొక్కల పొడి, బియ్యం పిండి తీసుకుని అందులో సరిపడా పాలు లేదా నీటిని పోసి మిక్స్ చేసుకోవాలి.ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని ఫేస్‌కి, నెక్‌కి పూసుకుని బాగా డ్రై అయిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.ఇలా చేయడం వల్ల స్కిన్ టోన్ పెరగడంతో పాటు గ్లోగా, కోమలంగా మారుతుంది.
ఇక మొటిమలను తగ్గించడంలోనూ మామిడి తొక్కలు ఉపయోగపడతాయి.
గిన్నెలో ఒక స్పూన్ మామిడి తొక్కల పొడి, చిటికెడు పసుపు మరియు పెరుగు వేసుకుని కలుపుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొటిమలపైనే కాకుండా ఫేస్ మొత్తానికి అప్లై చేసి ఆరిన తర్వాత క్లీన్ చేసుకోవాలి.
ఇలా చేస్తే మొటిమలే కాదు నల్లటి మచ్చలు, ముడతలు కూడా క్రమంగా తగ్గుతాయి.