ఈ సంవత్సరం శ్రీరామనవమి( Sri Rama Navami ) ఎంతో ప్రత్యేకమైనది.ప్రతి ఏడాది చైత్ర మాసంలో శుక్లపక్షం తొమ్మిదవ రోజున శ్రీరామ నవమి జరుపుకుంటారు.
ఈ సంవత్సరం ఏప్రిల్ 17వ తేదీన శ్రీరామనవమిని జరుపుకున్నారు.శ్రీరాముడు జన్మించిన రోజున శ్రీరామనవమి అభిజిత్ ముహూర్తం రోజు అరుదైన యాదృచ్ఛికం జరిగింది.
ఇదే రోజున గజకేసరి యోగం కూడా ఏర్పడింది.ముఖ్యంగా శ్రీరామనవమి రోజు నుంచి ఈ రాశుల వారి దశ తిరుగబోతుందని పండితుల వారు చెబుతున్నారు.
మరి ఆ అదృష్ట రాశులు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.
ముఖ్యంగా చెప్పాలంటే తుల రాశి( Libra ) వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది.
ఎన్నో రోజులుగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తి అవుతాయి.కొత్త వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఎక్కువగా ఉంది.
అప్పుగా ఇచ్చిన డబ్బులు మీ దగ్గరకు వస్తాయి.ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడం మీకు లబ్ధిని కలిగిస్తుంది.
మీ కెరియర్ ను మెరుగుపరచుకోవడానికి కూడా గొప్ప అవకాశాలు వస్తాయి.శ్రీరామనవమి మేష రాశి( Aries ) వారికి అదృష్టాన్ని తెస్తుంది.
ఈ సమయంలో ఈ రాశి వారు సమస్యలను అధిగమిస్తారు.ఊహించని విధంగా వీరి దగ్గరికి పూర్వికులు ఆస్తి వస్తుంది.
ఆర్థికంగా లాభపడతారు.మీ కుటుంబంలో ఉన్న సమస్యలు పరిష్కారమవుతాయి.ఈ రాశి వారిపై రాముడు దయ కచ్చితంగా ఉంటుంది.

అలాగే మకర రాశి( Capricorn ) వారికి శ్రీరామనవమి నుంచి బాగా కలిసి వస్తుంది.కెరీర్ పురోగతికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది.సమాజంలో ఉన్నతమైన మర్యాదలు పొందుతారు.
ధార్మిక ప్రదేశాలను సందర్శించే అవకాశం ఎక్కువగా ఉంది.అనుకున్న పనులన్నీ పూర్తి అవుతాయి.
అలాగే శ్రీరామనవమి రోజున కర్కాటక రాశి( Cancer ) వారికి శుభం కలుగుతుంది.భవిష్యత్తులో ఆర్థిక సమస్యలను సాధించడంలో మీకు సహాయపడే మంచి వ్యక్తిని మీరు కలుసుకునే అవకాశం ఉంటుంది.

కుటుంబంలో సానుకూల వాతావరణం ఉంటుంది.మీరు భవిష్యత్తు కోసం ప్లాన్ చేస్తున్నప్పుడు మీరు ప్రయోజనం పొందేందుకు అనేక అవకాశాలు ఉంటాయి.మీన రాశి వారికి శ్రీరామనవమి శుభ ఫలితాలను అందిస్తుంది.మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.ఇంట్లో ఉల్లాసమైన, సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది.ఈ సమయంలో డబ్బు పెట్టుబడి పెడితే అది ఎక్కువ ఆదాయాన్ని అందిస్తుంది.
కుటుంబ సభ్యులు సామరస్యంగా సమస్యలు లేకుండా జీవించే అవకాశం ఎక్కువగా ఉంది.