సనాతన ధర్మంలో సోమవాతి అమావాస్య( Somavati Amavasya )కు ఎంతో ప్రాముఖ్యత ఉంది.ముఖ్యంగా చెప్పాలంటే సోమవారం లేదా శనివారం వచ్చే అమావాస్య ఎంతో ముఖ్యమైనదని పండితులు చెబుతున్నారు.
ఈ సంవత్సరం వచ్చే సోమవతి అమావాస్య ఎంతో ప్రత్యేకమైనది.ఎందుకంటే ఈ రోజు సోమవారం సోమవాతి అమావాస్యతో కలిసి వస్తూ ఉంది.
ఈ ఏడాది మొదటి సోమవారం ఏప్రిల్ 8వ తేదీన సోమవాతి అమావాస్య వస్తూ ఉంది.అమావాస్య, సోమవారం రెండింటిలోనూ శివరాధనను ప్రత్యేకంగా పరిగణిస్తారు.
అలాంటి ఈ రోజున ఏం చేసినా రెట్టింపు ఫలితాలు ఉంటాయని పండితులు చెబుతున్నారు.సోమవాతి అమావాస్య రోజు మహా శివున్ని( Lord Shiva ) ఎలా పూజించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ముఖ్యంగా చెప్పాలంటే సోమవాతి అమావాస్య రోజు ఉపవాసం ఉండి శివుడిని పూజిస్తే తమ తమ భర్త లు ఆయురారోగ్యాలతో ఉంటారని చాలా మంది నమ్ముతారు.ఈ రోజు వారి వైవాహిక జీవితం బాగుండాలంటే పిండి, బియ్యం నెయ్యి, పంచదార దానం చేయాలి.అలాగే ఉపవాసం ఉన్న వ్యక్తికి అఖండ సౌభాగ్యం, సంతోషం,పుర్వికుల ఆశీస్సులు, విజయం లభిస్తాయి.ఈ రోజున ఉదయం స్నానం చేసి శివలింగానికి పచ్చి పాలు, గంగా జలాలతో అభిషేకం చేస్తే పితృ దోషం, కాలసర్పదోషం నుంచి విముక్తి పొందవచ్చు.
పూర్వీకుల ఆత్మలు సంతృప్తి చెందుతాయని నిపుణులు చెబుతున్నారు.

అలాగే సోమవతి అమావాస్య రోజు ఉదయం సూర్యోదయానికి ముందే స్నానం చేయాలి.సూర్యునికి అర్ఘ్యం సమర్పించాలి.అలాగే ఉపవాసం చేస్తానని ప్రతిజ్ఞ తీసుకున్న తర్వాత పంచామృతంతో శివునికి అభిషేకం చేయాలి.
అప్పుడు పచ్చిపాలతో రావి చెట్టుకు నీళ్లు పోసి దాన్ని చుట్టూ ఏడుసార్లు ప్రదక్షిణ చేయాలి.సాయంత్రం రావి చెట్టు కింద దీపం వెలిగించాలి.ఇది శివుడు, లక్ష్మీదేవి, శని దేవుడిని సంతోష పరుస్తుందని నిపుణులు చెబుతున్నారు.అలాగే మధ్యాహ్నం సమయంలో నువ్వులను నీళ్లలో వేసి దక్షిణం వైపున పూర్వికుల పేరుతో నైవేద్యంగా సమర్పించాలి.