ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం:ఉదయం 6.04
సూర్యాస్తమయం:సాయంత్రం.6.34
రాహుకాలం:ఉ.7.30 ల9.00
అమృత ఘడియలు:ఉ.9.00 ల10.30 మ3.40 సా6.00
దుర్ముహూర్తం:మ.12.47 ల1.38 ల3.20 సా 4.11
మేషం:

ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.తీరికలేని సమయంతో గడుపుతారు.దీనివల్ల కాస్త గందరగోళంగా అనిపిస్తుంది.మీరు పనిచేసే చోట ఇతరుల సహాయాన్ని కోరుకుంటారు.ఇతరులతో కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.సమయాన్ని కాపాడుకుంటారు.
వృషభం:

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా త్వరగా పూర్తవుతుంది.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కొన్ని కొత్త పనులు కూడా ప్రారంభిస్తారు.కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు వంటి ప్రయాణాలు చేస్తారు.దూర ప్రాంతపు బంధువుల నుండి శుభవార్త వింటారు.దీనివల్ల సంతోషంగా ఉంటారు.
మిథునం:

ఈరోజు మీకు కొన్ని వివాదాలు ఎదురవుతాయి.తిరిగి వాటిని పరిష్కరించుకునే శక్తి మీలో ఉంటుంది.కుటుంబ సభ్యులతో కొన్ని ప్రయాణాలు చేస్తారు.మీ స్నేహితులను కలుస్తారు.శత్రువులకు దూరంగా ఉండాలి.అనవసరమైన విషయాలను ఎక్కువగా ఆలోచించకూడదు.
కర్కాటకం:

ఈరోజు మీరు కొత్త పనులు ప్రారంభిస్తారు.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఇతరులు మీ సొమ్మును తిరిగి ఇస్తారు.దీనివల్ల కాస్త మనశ్శాంతి కలుగుతుంది.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన అంశాల గురించి మాట్లాడతారు.కొన్ని ఖర్చులు ఎక్కువగా చేయాల్సి వస్తుంది.
సింహం:

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ఓ శుభవార్త వింటారు.పిల్లలతో సంతోషంగా గడుపుతారు.ఈరోజు వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో లాభాలు అందుకుంటారు.అనుభవం ఉన్న వ్యక్తులతో కూడా మాట్లాడతారు.ఈరోజు సమయాన్ని కాపాడుకోవాలి.లేదంటే ఇబ్బందులు ఎదుర్కొంటారు.
కన్య:

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో లాభాలు అందుకుంటారు.
ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచనలు చేయాలి.సమయాన్ని కాపాడుకోవాలి.
తుల:

ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా చర్చలు చేయకండి.ఇతరులతో వాదనలకు దిగకండి.శత్రువులకు దూరంగా ఉండాలి.
మీ వల్ల ఇతరులకు ఇబ్బందులు వచ్చేలా చేయకండి.లేదంటే గొడవలు జరిగే అవకాశం ఉంటుంది.సమయాన్ని కాపాడుకోవాలి.
వృశ్చికం:

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.వాయిదా పడిన పనులు అన్నీ పూర్తి చేస్తారు.ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.
పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు.కొన్ని విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి.పై అధికారుల ప్రశంసలు అందుకుంటారు.
ధనుస్సు:

ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా చర్చలు చేయకండి.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.ఆర్థికంగా లాభాలు అందుకునే అవకాశం ఉంది.
కుటుంబ సభ్యులతో దైవ దర్శనం వంటి ప్రయాణాలు చేస్తారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.చాలా సంతోషంగా ఉంటారు.
మకరం:

ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని నష్టాలు ఎదుర్కోవాల్సి.ఇతరులు అప్పుగా తీసుకున్న మీ సొమ్మును తిరిగి ఇవ్వడంలో ఆలస్యం చేస్తారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలి.
కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల అనుకూలంగా ఉంటుంది.ఈరోజు మీ విలువైన సమయాన్ని కాపాడుకోవాలి.
కుంభం:

ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.ఆర్థికంగా పొదుపు చేయాలి.దీనివల్ల భవిష్యత్తులో లాభాలు ఉంటాయి.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.అనవసరమైన విషయాలకి దూరంగా ఉండాలి.తోబుట్టువులతో సంతోషంగా ఉండాలి.అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.
మీనం:

ఈరోజు మీరు ఆర్థికంగా నష్టాలు ఎదుర్కొంటారు.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.కొన్ని ప్రయాణాలు చేయకపోవడం మంచిది.
అనవసరమైన విషయాల గురించి ఎక్కువ చర్చలు చేయకండి.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.
సమయాన్ని వృథా చేయకూడదు.