అభిమన్యుడి మరణం శ్రీకృష్ణుడికి ముందే తెలుసా..?

ముఖ్యంగా చెప్పాలంటే మహాభారత( Mahabharata ) కథలోని వీర యోధులలో అభిమన్యుడు ఒకడు అని దాదాపు చాలా మందికి తెలుసు.అభిమన్యుడు ప్రతి వ్యక్తికి ఒక ప్రేరణ.

 Did Lord Krishna Know Aboutabhimanyu's Death, Mahabharata , Abhimanyu, Death,-TeluguStop.com

ఈ యోధుడు మహాభారత యుద్ధంలో ఒక రోజంతా యోధానుయోధులందరినీ ఒంటరిగా అడ్డుకున్నాడు.తను ఒక్కడే వేలాదిమంది సైనికులతో సమానం అన్న విధంగా యుద్ధంలో పోరాడుతూ అమరవీరుడయ్యాడు.

అయితే అభిమన్యుడి మరణం శ్రీకృష్ణుడు( Lord Krishna ) చూస్తూ నిలబడిపోయాడు.అయితే ఇదంతా ఒక ఉద్దేశాన్ని నెరవేర్చడం కోసమేనని పండితులు చెబుతున్నారు.

అలాగే ధర్మాన్ని రక్షించడానికి దేవతలు భూమిపై అవతరించినప్పుడు చంద్రుని కుమారుడు వర్చా అభిమన్యుని( Abhimanyu ) రూపంలో జన్మించాడు.చంద్రుడు దేవతలతో ఇలా అన్నాడు.నా ప్రియమైన కొడుకు నా ప్రాణం తో సమానం.నేను కుమారున్నీ వదిలి అసలు ఉండలేను.కాబట్టి భూమి మీదకు పంపించలేను.అయితే ఇప్పుడు వెనక్కి తగ్గడం సముచితం కూడా కాదు.

అందుకే వర్చా మానవుడిగా అవతరిస్తాడు.అయితే ఎక్కువ కాలం ఉండడు.

ఇంద్రుడి అవతారమైన అర్జునుడి కొడుకుగా పుడతాడు అని చెప్పాడు.

శ్రీకృష్ణుడు అర్జునుడు బావ బావమరిది.అయిన కూడా స్నేహితుల కన్న ఎక్కువగా ఉండేవారు.చంద్రుడు తన కొడుకు వర్చా అవతరించే సమయంలో దేవతల ముందు షరతూ పెట్టాడు.

శ్రీకృష్ణుని ముందు తన కొడుకు చక్రవ్యూహంలో యుద్ధం చేస్తూ గొప్ప యోధులను కూడా ఆశ్చర్యపరుస్తాడు.అయితే రోజంతా సాయంత్రం వరకు పోరాడి చనిపోయి తిరిగి తన దగ్గరకు తిరిగి వస్తాడని తన కోరికను వెల్లడించాడు.

దీంతో కురుక్షేత్ర యుద్ధంలో అభిమన్యుడు తన శౌర్యాన్ని ప్రదర్శించి తండ్రి లేని సమయంలో జరుగుతున్న యుద్ధంలో చక్రవ్యూహంలో ప్రవేశించి వీరులతో పోరాడి చిన్న వయసులోనే మరణించాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube