అయోధ్యలో నూతన రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి.ఈ నేపథ్యంలో ఈనెల 22న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట జరగనుంది.
రామాలయంలో మూడు రాముని విగ్రహాలు ప్రతిష్టాపనకు సిద్ధం అయ్యాయి.ప్రధాన ఆలయంలో ఐదేళ్ల వయసు గల 51 అంగుళాల బాల రాముని విగ్రహాన్ని ప్రతిష్టాపన చేయనున్నారు.
ఈ క్రమంలోనే మూడు విగ్రహాలను శిల్పులు రూపొందించారు.గణేశ్ భట్, అరుణ్ యోగిరాజ్ మరియు సత్యనారాయణ పాండే మూడు రాముని విగ్రహాలను రూపొందించారు.
అయితే దైవత్వం ఉట్టిపడే విధంగా ఉన్న విగ్రహాం భక్తులను మంత్రముగ్ధుల్ని చేస్తుందని ఓ సందర్భంగా రూపకర్తలు చెప్పిన సంగతి తెలిసిందే.