ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుమల పుణ్యక్షేత్రానికి ప్రతి రోజు ఎన్నో వేల మంది వచ్చి శ్రీవారిని దర్శించుకుని వెళుతూ ఉంటారు.అంతే కాకుండా చాలా మంది భక్తులు స్వామివారికి తల నీలాలు సమర్పించి పూజలు, అభిషేకాలు చేస్తూ ఉంటారు.
ఇంకా చెప్పాలంటే మన దేశవ్యాప్తంగా చాలా మంది ప్రజలు శ్రీవారిని దర్శించుకోవాలని వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.అందులో ముఖ్యంగా చెప్పాలంటే శ్రీవారి లడ్డు ప్రసాదానికి ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది.
ప్రస్తుతం పర్యావరణ పరిరక్షణలో భాగంగా పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో సంపూర్ణ ప్లాస్టిక్ నిషేధం అమలు చేసే విధంగా మరో కిలక నిర్ణయం తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకుంది.తిరుమలలో ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించే లా తిరుపతి దేవస్థానం మరో ప్రయత్నం చేసింది.
తాటాకు బుట్టల వినియోగాన్ని అమలులోకి తెస్తూ, ఒక వైపు ప్లాస్టిక్ వినియోగం తగ్గించి పర్యావరణ పరిరక్షణ జరగడమే కాకుండా మరో వైపు హస్తకళలను ప్రోత్సహించినట్లు ఉంటుందని భావించింది.ఈ మేరకు ప్రకృతి వ్యవసాయ వేత్త విజయరామ్ తాటాకులతో వివిధ పరిమాణాలలో తయారు చేసిన బుట్టలను తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ధర్మారెడ్డికి అందజేశారు.
ఈ తాటాకు బుట్టలను త్వరలో లడ్డు కౌంటర్లలో వినియోగంలోకి తీసుకోనీ వస్తున్నామని ఈవో ధర్మారెడ్డి తెలిపారు.ఈ సమయంలో తాటాకు బుట్టలు వినియోగం సాధ్యాలతో పాటు లడ్డు ప్రసాదనాన్ని తీసుకెళ్లి భక్తులకు బుట్టలు ఎంత మేరా ఉపయోగకరంగా ఉంటాయన్న దానిపై తిరుమల తిరుపతి దేవస్థానం ఒక అధ్యయనం కూడా చేసింది.ఇప్పటికే తిరుమల క్షేత్రంలో ప్లాస్టిక్ వాటర్ బాటిల్ లతో పాటు ప్లాస్టిక్ కవర్లలో పూజా సామాగ్రిని దేవాలయంలో అనుమతించడం లేదు.అలాగే దేవాలయానికి అనుబంధంగా ఉండే షాపులలో ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ వాటర్ బాటిల్ అమ్మకాలను ఇప్పటికే నిషేధించడం జరిగింది.
దేవాలయంలో ప్రసాదాల పంపిణీలోని చిన్నచిన్న ప్లాస్టిక్ కూడా బ్యాన్ చేశారు.ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ బదులుగా సీసాలను వినియోగిస్తున్న సంగతి తెలిసిందే.
DEVOTIONAL