సాధారణంగా ఇంటి నిర్మాణ విషయంలో వాస్తు శాస్త్రం( Vastu shastra ) ఎంతగానో ఉపయోగపడుతుంది.అయితే వాస్తు దోషము ఉంటే ఎంత మంచి ఇల్లు కట్టించుకున్న ఆ ఇంట్లో సంతోషం అన్నది ఉండదు.
అయితే చాలామందికి ఉండే అనుమానం ఏమిటంటే ఇంటి నిర్మాణం దక్షిణం వైపు ఉంటే మంచిదా లేదా అని అనుకుంటూ ఉంటారు.అయితే దాని గురించి వాస్తు శాస్త్రం ఏం చెబుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
దక్షిణం వైపు ఇల్లు నిర్మిస్తే సూర్యకిరణాలు ఇంట్లో పడవని అది అశుభమని, దీనివలన ఇల్లు చీకటిగా అసలు నివసించడానికి వీలు లేకుండా ఉంటుందని చాలా మంది భావిస్తూ ఉంటారు.జ్యోతిష్య శాస్త్రం( Astrology ) కూడా ఇదే చెబుతోంది.
దక్షిణం వైపు కట్టించిన ఇంట్లో ఎప్పుడు కూడా ఆర్థిక, వైవాహిక ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి.
అయితే దక్షిణం వైపు ఇల్లు కట్టుకుంటే అన్ని కష్టాలే ఉంటాయి అని చాలామంది చెబుతూ ఉంటారు.కానీ ఇటీవల ఓ ప్రముఖ వాస్తు శాస్త్ర నిపుణులు మాత్రం ఈ మాటలు అస్సలు నమ్మవద్దని చెబుతున్నారు.దక్షిణం వైపు ఇల్లు కట్టుకున్న కూడా పాటించాల్సిన వాస్తు నియమాలు పాటిస్తే ఎలాంటి దోషాలు ఉండవని చెబుతున్నారు.
చాలామందికి ఇల్లు కట్టించుకునే స్తోమత ఉంటుంది కానీ వాస్తు ప్రకారం కట్టించుకోవడం వీలుపడదు.వాస్తు దోషము ఉన్న లేకున్నా ఉండటానికి ఓ ఇల్లు ఉంటే చాలు అనుకున్న వారు చాలామంది ఉన్నారు.
అయితే ఇల్లు ఏ వైపున నిర్మించాలనుకున్న కూడా ఆ దిశకు సంబంధించిన దేవుడు బొమ్మ పెట్టుకోవాల్సి ఉంటుంది.అలాగే దక్షిణం వైపు నిర్మించిన ఇల్లు అన్ని వర్గాల వారికి మంచి చేస్తాయని చెప్పలేము.
అలాంటి ఇంట్లో ఉండాలనుకునే వారికి జాతకం, వృత్తి ప్రకారం అలాంటి ఇంట్లో ఉండవచ్చా లేదా అన్నది చూసుకోవాలి.ఇక దక్షిణానికి అధిపతి కుజుడు( Kujudu ).కాబట్టి రియల్ ఎస్టేట్, హెల్త్ ఇండస్ట్రీలో పనిచేసే వారికి ఈ వైపు ఇళ్లల్లో నివసించేందుకు వీలు ఉండదు.అలాగే సినిమా రంగం వారికి కూడా దక్షిణం బాగా కలిసి వస్తుందని చెప్పవచ్చు.
పోలీసులు, లాయర్లు, మిలిటరీ, సెక్యూరిటీ, బాడీగార్డ్, ఫ్యాక్టరీ ఓనర్లు, పరిశ్రమలకు చెందిన ఓనర్లు, యాక్టర్లు, సంగీత దర్శకులు, డాక్టర్లు, నర్సులు వీరందరికీ దక్షిణం బాగా కలిసి వస్తుందని చెప్పవచ్చు.
LATEST NEWS - TELUGU