సాధారణంగా చెప్పాలంటే కొన్నిసార్లు మనం నడిచేటప్పుడు రోడ్డు పై అనుకోకుండా చిల్లర నాణేలు కానీ, కరెన్సీ నోట్లు కానీ దొరుకుతూ ఉంటాయి.వీటిని తీసుకోవడం వల్ల ఏం జరుగుతుందో చాలా మందికి అస్సలు తెలియదు.
దీని వల్ల కొన్ని సార్లు మంచి జరిగితే, కొన్ని సార్లు చెడు జరుగుతుంది.హిందూ ధర్మంలో ప్రతి దానికి కొన్ని నియమాలు కచ్చితంగా ఉంటాయి.
అదే విధంగా రోడ్డు పై డబ్బులు దొరకడం( Money Found on Road ) కూడా శుభ, అశుభమైన విషయాలను సూచిస్తుంది.ఆ విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
జ్యోతిష్య శాస్త్రం( Astrology )లో రోడ్డు పై డబ్బు నాణేలు దొరికితే శుభప్రదంగా చెప్పవచ్చు.ఇది మీ పూర్వీకుల ఆశీర్వాదం పొందుతారని సూచిస్తుంది.అలాగే హిందూ ధర్మం ప్రకారం( Hindu Sanatana Dharma ) రోడ్డు పై డబ్బులు దొరికితే మీరు చేసే పనిలో కచ్చితంగా విజయం సాధిస్తారని అర్థం చేసుకోవచ్చు.చైనా లో అయితే ఇలాంటి నాణాలను అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఉపయోగిస్తారు.
వాస్తు శాస్త్రం ప్రకారం ముఖ్యమైన పని కోసం బయటకు వెళ్తుంటే దారిలో నాణెం లేదా నోటు దొరికితే ఆ పనిలో విజయం సాధిస్తారని అర్థం చేసుకోవచ్చు.అంతే కాకుండా ఏదైనా పని నుంచి తిరిగి వస్తున్నట్లయితే దారిలో డబ్బు పడి ఉంటే మీరు ఆర్థిక ప్రయోజనాన్ని( Financial ) పొందుతారని అర్థం చేసుకోవచ్చు.
హిందూ ధర్మం ప్రకారం కొంత డబ్బు రోడ్డు పై పడి ఉంటే దానిని దేవాలయానికి విరాళంగా ఇవ్వాలి.ఆ డబ్బును అసలు ఖర్చు పెట్టకూడదు.ఇలా చేస్తే ఆర్థిక సంక్షోభం మరింత పెరిగే అవకాశం ఉంది.అయితే ఈ విషయాలన్నీ కొంత మంది నమ్ముతారు.మరి కొంత మంది అసలు నమ్మరు.ఏమైనప్పటికీ శాస్త్రాల ప్రకారం రోడ్డు పై డబ్బు లభిస్తే ఇలా దేవాలయానికి విరాళంగా ఇవ్వడమే మంచిదని పండితులు చెబుతున్నారు.