ఎవరికైనా నరదృష్టి( naradrushti ) ఉందని గ్రహించడం ఎలాగంటే ఆ వ్యక్తిని అలసట ఆవహిస్తూ ఉంటుంది.తరచుగా ఆవలింతలు వస్తూ ఉంటాయి.
ఏ పనిలోనూ మనసు లగ్నమై ఉండదు.కొత్త దుస్తులు ధరిస్తే అవి చిరిగిపోతుంటాయి.
కొన్నిసార్లు దానిపై కొన్ని నల్ల మచ్చలు కూడా ఉండవచ్చు.ఇంట్లో సమస్యలు, అడ్డంకులు, దుఃఖం, ఎడబాటు, నష్టం, ఆస్తుల నష్టం ఒకదాని తర్వాత ఒకటి జరుగుతూ ఉంటాయి.
అలాగే భార్యాభర్తల మధ్య లేనిపోని సమస్యలు, అనుమానాలు, బంధువులతో శత్రుత్వం, శుభకార్యాలలో ఆటంకాలు, వైద్య ఖర్చులు, తినడానికి ఇష్టపడకపోవడం, అందరితో మండిపడడం, చెడు కలలు, నిద్రలేమి, ప్రతికూల ఆలోచనలు మొదలైనవి వస్తూ ఉంటాయి.

ముఖ్యంగా చెప్పాలంటే నిద్రలేమి పెరిగి ఆహారం ఇష్టపడకపోవచ్చు.తరుచుగా అనారోగ్య సమస్యలతో( health problems ) బాధపడుతూ ఉంటారు.చేతిలో ఉన్న వస్తువులన్నీ చేజారిపోతూ ఉంటాయి.
ఇలాంటి నరదృష్టి కి పరిహారలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.సంధ్యా సమయంలో నరదృష్టిని తీసివేయాలి.
ముఖ్యంగా చెప్పాలంటే మంగళవారం లేదా ఆదివారం సాయంత్రం దిష్టి తీసుకోవాలి.అమావాస్య రోజున గుమ్మడికాయతో, టెంకాయ తో, నిమ్మ పండుతో దిష్టి తీసుకోవడం ఎంతో మంచిది.
అలాగే ఇంటి పైన దిష్టి తొలగించుకునేందుకు ఇంటి ముందు అందరూ చూసేలా ప్రధాన ద్వారం వద్ద నీలా కుండి లో పువ్వులని నింపి ఉంచడం మంచిది.

అలాగే ఇంటి గుమ్మానికి కలబంద ( Aloe vera )మొక్కను లేదా గుమ్మడి కాయను, దిష్టి బొమ్మలను వేలాడదీయడం ఎంతో మంచిది.అంతే కాకుండా ఫిష్ ట్యాంక్( Fish tank ) ను ఇంట్లో ఆఫీసులో ఎక్కడ నైన ఉపయోగించవచ్చు.ముఖ్యంగా సందర్శకుల దృష్టి మరల్చడానికి ఒక చేపల తొట్టిని ఉపయోగించాలి.
ఇంకా చెప్పాలంటే స్నానం చేసేటప్పుడు నీటిలో ఉప్పు కలిపితే శరీర అలసట సోమరితనం తొలగిపోతుంది.ఇలా వారానికి ఒక సారి చేయడం ఎంతో మంచిది.
ముఖ్యంగా వారి పుట్టిన రోజు లేదా మంగళవారం ఇలాంటి స్నానం చేయడం ఎంతో మంచిది.