Mahashivratri : మహాశివరాత్రి రోజున శివలింగానికి ఇలా చేస్తే దుఃఖాలన్నీ మాయం..!

సనాతన ధర్మంలో మహాశివరాత్రి( Maha Shivaratri ) కి గొప్ప ప్రాముఖ్యత ఉంది.శివ పురాణాల ప్రకారం శివుడికి, పార్వతి దేవికి మహా శివరాత్రి నాడు వివాహం జరిగింది.

 Offer These Things To Shivaling On Maha Shivaratri-TeluguStop.com

ఈ విశేషాలు రోజున శివపార్వతులను భక్తిశ్రద్ధలతో పూజించిన భక్తుల బాధలు తొలగి పోతాయని అందరూ నమ్ముతారు.అయితే మహా శివరాత్రి రోజున శివునికి ఎంతో సంతోషాన్ని కలిగించే కొన్ని పరిహారాలు చేస్తే చాలా మంచిది.

అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.మహా శివరాత్రి రోజున పాలు, పంచదార, నల్ల నువ్వులను( Black Sesame Seeds ) వేసి శివలింగానికి అభిషేకం చేయాలి.

అలాగే అభిషేకం చేస్తున్నప్పుడు “ఓం జున్ సా” అనే మంత్రాన్ని జపించాలి.ఇలా చేయడం వలన అనేక వ్యాధులు తగ్గుతాయి.అలాగే మహా శివరాత్రి రోజు నుండి మూడు రోజుల పాటు శివలింగానికి కుంకుమ పువ్వు కలిపిన పాలను( Saffron Milk ) సమర్పించలి.ఇలా చేయడం వలన పెళ్లి ఫిక్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

అలాగే పసుపు పువ్వులను కూడా శివునికి సమర్పించవచ్చు.మహా శివరాత్రి నాడు తెల్లవారు జామున నిద్ర లేచి, స్నానం చేసి సమీపంలోని శివాలయానికి నీళ్లతో అభిషేకం చేసి స్వచ్ఛమైన తెల్ల చందనం పూయాలి.

దీని తర్వాత శివాలయంలో కొంత సేపు కూర్చొని ఓం నమశ్శివాయ( Om Namah Shivaya ) అనే మంత్రాన్ని జపించాలి.దీని వలన అనారోగ్యం, ఆందోళన రెండు దూరమైపోతాయి.అలాగే మహా శివరాత్రి నాడు ఎద్దుకు పచ్చిగడ్డి తినిపించాలి.ఇది బాధలను కూడా తొలగిస్తుంది.అలాగే జీవితంలో సుఖ సంతోషాలు కలిగి మనస్సు ఆనందంగా ఉంటుంది.అలాగే ఈశాన్యంలో రుద్రాభిషేకం( Rudrabhishekam ), బ్రహ్మ పూజ చేయడం వలన కూడా పనిలో ఆటంకాలు, పరస్పర విభేదాలు, అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి.

దీంతో జీవితంలో అన్ని శుభ ఫలితాలు అందుతాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube