దసరా సంబరాలు( Dussehra celebrations ) అంటే ఊరువాడ, పల్లె, పట్టణం అనే తేడా లేకుండా ఎంతో ఘనంగా జరుగుతాయి.మన భారత దేశంలో నలుమూల ప్రాంతాలలో దసరా ఉత్సవాలలో మునిగితేలుతూ ఉంటే ఒక గ్రామం మాత్రం దసరా వేడుకలకు దూరంగా ఉంటుంది.ఇది ఈ సంవత్సరం వ్యవహారము కాదు.100 సంవత్సరాలుగా ఈ గ్రామంలో దసరా వేడుకలు జరగడం లేదు.పైగా గ్రామ ప్రజలంతా ఇళ్లలోనే ఉంటారు.ఎక్కడికి వెళ్ళరు.ఆ గ్రామం ఎక్కడ ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. ఉత్తరప్రదేశ్ లోని మీరట్ నగరానికి 20 కిలోమీటర్ల దూరంలోని ఒక పల్లెటూరు ఉంది.
ఇక్కడ దసరా రోజున ప్రజలు ఇంటి గడప దాటరు.
ఎందుకంటే ఎప్పుడో 156 సంవత్సరాల క్రితం ఆ గ్రామానికి చెందిన 9 మందిని బ్రిటిష్( British ) వారు ఉరితీసిన విషయాన్ని గుర్తు పెట్టుకొని ఇప్పటికీ పండుగ జరుపుకోకపోవడం విశేషం.ముఖ్యంగా చెప్పాలంటే భారతదేశ చరిత్ర ఒక ముఖ్యమైన సంఘటన 1857 సిపాయిలా తిరుగుబాటు.బ్రిటిష్ విధానాలను వ్యతిరేకరిస్తూ జరిగిన తొలి వలసవాద వ్యతిరేక ఉద్యమం.
ఈ ఉద్యమాన్ని బ్రిటిష్ వాళ్ళు చాలా క్రూరంగా అణచివేసినప్పటికీ ఎందరికో స్వతంత్ర నినాదాన్ని ఇచ్చేలా ఈ ఉద్యమం చైతన్య పరిచింది.వారిలోని దేశభక్తిని మేల్కొల్పి విశ్వాసం రగిల్చిన గొప్ప ఘట్టం అది.అయితే ఈ 1857 సిపాయిల తిరుగుబాటులో స్ఫూర్తిగా తీసుకొని భారతదేశంలో పలుచోట్ల బ్రిటిష్ వారి విధానాలను వ్యతిరేకిస్తూ తిరుగుబాట్లు జరిగాయి.
వీరిలో గగోల్ ప్రాంత వాసులు కూడా ఉన్నారు.ఆ గ్రామం చుట్టుపక్కల గ్రామాల ప్రాంతవాసులు జండా సింగ్( Janda Singh ) సారథ్యంలో తమ గ్రామాలకు సమీపంలో ఉన్న ఆంగ్లేయుల శిబిరాలను ధ్వంసం చేశారు.దీంతో బ్రిటిష్ వాళ్ళు ఆ గ్రామాలపై దాడికి దిగారు.
బిషన్ సింగ్ ఆంగ్లేయులను పక్కదారి పట్టించి వారి పన్నాగాన్ని గ్రామస్తులకు తెలియజేశాడు.ఫలితంగా ఆ గ్రామాల ప్రజలు సులభంగా తప్పించుకోగలిగారు.ఝండాసింగ్ నేతృత్వంలో దాడులకు దిగిన సుమారు 9 మందిని బ్రిటిష్ వారు అరెస్టు చేయడమే కాకుండా వారికి మరణశిక్ష విధించారు.1857 దసరా రోజున ఆ 9 మందిని ఉరి తీసారు.ప్రతి సంవత్సరం దసరా రోజున ప్రజలు వారికి నివాళులర్పించి వారి స్మృత్యార్థం వేడుకలు జరుపుకోవడం మానేశారు.ఈ తొమ్మిది మంది జ్ఞాపకార్థం వారినీ ఉరితీసిన మర్రిచెట్టు కిందే గ్రామస్తులు వారి సమాధులను నిర్మించారు.
LATEST NEWS - TELUGU