అనంత చతుర్దశి వెనుక ఉన్న కథ గురించి తెలుసా..?

Significance Of Ananta Padmanabha Vratam,Ananta Padmanabha Vratam,Ananta Chaturdasi,Devotional Stories,Lord Sri Krishna,Ananta Padmanabha Vratha Katha

పంచాంగం ప్రకారం భాద్రపదమాసం శుక్లపక్ష చతుర్దశిన అనంత చతుర్దశి( Ananta Chaturdashi ) వచ్చినట్లు పండితులు చెబుతున్నారు.అనంత చతుర్దశి రోజున అనంత పద్మనాభ వ్రతం ఆచరించిన వారికి సకల శుభాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.

 Significance Of Ananta Padmanabha Vratam,ananta Padmanabha Vratam,ananta Chaturd-TeluguStop.com

జూదంలో ఓడిపోయి వనవాసం చేస్తూ ఎన్నో ఈతి బాధలు అనుభవిస్తూ దిక్కు తోచని స్థితిలో ఉన్న పాండవ అగ్రజుడు ధర్మరాజు శ్రీకృష్ణుని చూసి ఓ జగద్రాక్షకా మేము అనుభవిస్తున్న ఈ కష్టాల నుంచి దూరం కావడానికి మార్గం చెప్పమని ప్రార్థిస్తాడు.అప్పుడు కృష్ణుడు( Lord Krishna ) భాద్రపద శుక్ల చతుర్దశి రోజు అనంత పద్మనాభ వ్రతము ఆచరించాలని సూచిస్తాడు.

Telugu Bhakti, Devotional-Latest News - Telugu

కృత యుగామందు సుమంతుడు దీక్ష అను బ్రాహ్మణ దంపతులకు మహావిష్ణువు అనుగ్రహంతో ఒక కుమార్తె కలుగుతుంది.బాలికకు శీల అని పేరు పెడతారు.ఈ క్రమంలో సుమంతుని భార్య దీక్ష అనారోగ్యంతో మరణించగా, సుమంతుడు మరొక మహిళను వివాహం చేసుకుంటాడు.ఇలా ఉండగా రూపా లావణ్యవతి అయిన శీలను కౌండిన్యుడు సుమంతుని అంగీకారంతో ఆమెను వివాహం చేసుకుంటాడు.

ఆ తర్వాత శీలతో కలిసి ఎడ్ల బండి పై తిరుగు ప్రయాణంలో ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటాడు.ఇంతలో శీల సమీప నది తీరమందు కొందరు పూజలు చేస్తుండగా వారి వద్దకు చేరి ఆ పూజ గురించి అడుగుతుంది.

Telugu Bhakti, Devotional-Latest News - Telugu

వారు అనంత పద్మనాభ వ్రతం( Anantha Padmanabha Vratham ) గురించి చెబుతారు.ఈ రోజు కనుక విధి విధానంగా ఆ నారాయణుని ఆరాధించి, ఆ ఆరాధనలో ఉంచిన 14 ముళ్ళు కలిగిన పట్టు త్రాడు తోరం భర్త భార్య ఎడమ చేతికి, భార్య భర్త కుడి చేతికి కడితే అష్టైశ్వర్యాలు, సుఖసంతోషాలు లభిస్తాయని చెబుతారు.వారు ఇచ్చిన తోరం ధరించి కౌండిన్య మహర్షి వద్దకు రాగానే మహర్షి ఆమె చేతిలో ఉన్న తోరమును చూసి మిక్కిలి ఆగ్రహించి నన్ను వశీకరించుకొనుటక ఈ తోరం కట్టుకున్నావా అంటూ దానిని తెంపి నిప్పులపై విసిరేస్తాడు.శీల తన వద్ద ఉన్న తోరమును పాలలో వేసి భద్రపరుస్తుంది.

అప్పటి నుంచి కౌండిన్యుడు సకల సంపదలను కోల్పోతాడు.ఆ తర్వాత కౌండిన్యుడు పశ్చాత్తాప పడి తోరమును మళ్లీ ధరిస్తాడు.

ఆ తోరము సకల శుభాలను చేకూర్చి అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube