ముఖ్యంగా చెప్పాలంటే గురువారం రోజు శ్రీమహావిష్ణువును( Lord Vishnu ) చాలామంది ప్రజలు పూజిస్తూ ఉంటారు.మహా విష్ణువు అనుగ్రహం పొందడానికి గురువారం( Thursday ) స్నానం చేసి ధ్యానం చేయడం ఎంతో మంచిదని పండితులు చెబుతున్నారు.
ఆ తర్వాత కొన్ని పనులను చేస్తే మీ జీవితంలో ఎప్పుడూ ధనానికి కొరతే ఉండదని నిపుణులు చెబుతున్నారు.ఇంకా చెప్పాలంటే ప్రతి గురువారం రోజు మహావిష్ణువును చాలామంది ప్రజలు పూజిస్తూ ఉంటారు.
అలాగే ఈ రోజు మహా విష్ణువుతో పాటు లక్ష్మీదేవిని కూడా పూజిస్తూ ఉంటారు.

అంతేకాకుండా గురువారం రోజున దేవగురువు బృహస్పతిని కూడా పూజిస్తారు.శ్రీ విష్ణువును గురువారం పూజిస్తే మీ ఇంట్లో సుఖసంతోషాలు, శాంతి, శ్రేయస్సు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు.అంతేకాకుండా వృత్తి, వ్యాపారాలు చేసే వారికి కూడా ఎన్నో లాభాలు వస్తాయని చెబుతున్నారు.
అలాగే అనుకున్న పనులు త్వరగా నెరవేరుతాయి.గురువారం రోజు కొన్ని పరిహారాలు చేస్తే మీ ఆదాయం, అదృష్టం పెరుగుతాయని పురాణాలు చెబుతున్నాయి.
ఆ పరిహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.గురువారం రోజున శ్రీమహావిష్ణువు అనుగ్రహం పొందడానికి తల స్నానం చేసి ధ్యానం చేయాలి.

ఆ తర్వాత పసుపు రంగు దుస్తుల ధరించి ముందుగా భాస్కరుడికి నీళ్లు సమర్పించాలి.ఆ తర్వాత లక్ష్మినారాయణుడికి పూజ చేయాలి.అయితే పూజ సమయంలో విష్ణుమూర్తికి అష్టదళ తామరను సమర్పించాలని పండితులు( Scholars ) చెబుతున్నారు.దీనివల్ల మీరు విష్ణుమూర్తి అనుగ్రహం పొందుతారు.అంతేకాకుండా ఆర్థిక పరిస్థితి బాగా లేనప్పుడు గురువారం చేసే పూజా సమయంలో కొబ్బరికాయను( Coconut ) సమర్పించాలి.అలాగే దేవునితో ఐశ్వర్యం, సంతోషాలు, సౌభాగ్యాలు కలగాలని ప్రార్థించాలి.
ఇలా చేయడం వల్ల మీ ఆదాయం పెరుగుతుంది.అలాగే గురువారం రోజు చేసే పూజా సమయంలో విష్ణుమూర్తికి, కుంకుమపువ్వు కలిపిన పాలతో అభిషేకం చేయాలి.
ఇలా చేయడం వల్ల మహావిష్ణువు అనుగ్రహం ఎప్పుడు మీపై ఉంటుంది.దీని వల్ల మీ జీవితంలో ధనానికి కొరతే ఉండదు.