ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో రీ రిలీజ్ ల ట్రెండ్ నడుస్తున్న విషయం మనందరికీ తెలిసిందే.స్టార్ హీరోల పుట్టినరోజు సందర్భంగా వారి కెరియర్ లో సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ హిట్ అయిన సినిమాలను మరొకసారి రీ రిలీజ్ చేస్తున్నారు.
ఇప్పటికే ఎన్నో సినిమాలు ఫ్రీ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.సూపర్ హిట్ అయిన సినిమాలు మాత్రమే కాకుండా ఫ్లాప్ అయిన సినిమాలు కూడా రిలీజ్ చేయగా ఆశ్చర్యంగా ఆ సినిమాలు కూడా కలెక్షన్లు కురిపిస్తున్నాయి.
ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan kalyan ) నటించిన జల్సా, తమ్ముడు, తొలిప్రేమ,ఖుషీ వంటి సినిమాలను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.

ఇది ఇలా ఉంటే తాజాగా అందిన సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ నటించిన తీన్ మార్ సినిమా( Teenmaar )ను రీ రిలీజ్ చేయమని ఫ్యాన్స్ అడగడంతో ఆ సినిమాను రిలీజ్ చేయడానికి మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.ఆ విషయంపై బండ్ల గణేష్( Bandla ganesh ) స్పందిస్తూ తీన్ మార్ సినిమాను బెస్ట్ క్వాలిటీతో రీ రిలీజ్ చేస్తానని తెలిపారు.సౌండ్ క్వాలిటీ సరిగ్గా ఉండదు, డైలాగ్స్ కూడా వినిపించవు కాస్త చూసుకో అన్నా అని ఒక నెటిజన్ రిక్వెస్ట్ పెట్టాడు.
నాకు తెలుసు.ఈ సారి అవన్నీ సెట్ చేసి రిలీజ్ చేస్తాను అని చెప్పుకొచ్చాడు బండ్ల గణేష్.

తీన్ మార్ సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన బండ్లన్న నష్టపోయిన విషయం తెలిసిందే.అందుకే మళ్లీ వెంటనే పవన్ కళ్యాణ్ అవకాశం ఇచ్చాడు.మరి రీ రిలీజ్ లో ఈ సినిమా ఏ మేరకు కలెక్షన్లను రాబడుతుందో చూడాలి మరి.సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.అంతేకాకుండా ఈ వార్తని సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు.మరి పవన్ నటించిన సినిమాలు ఇప్పటివరకు రీ రిలీజ్ అయ్యి బాగానే కలెక్షన్స్ సాధించాయి.మరి తీన్మార్ సినిమా ఏ మేరకు కలెక్షన్లను రాబడుతుందో చూడాలి మరి.







