ప్రతి రోజు మనం వంటల్లో అల్లంను ఉపయోగిస్తూ ఉంటాం.ఒకరకంగా చెప్పాలంటే అల్లం లేనిదే ఆ రోజు వంట కాదంటే అతిశయోక్తి కాదు.
అల్లం వంటలకు రుచిని ఇవ్వటమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.అల్లంను ఆయుర్వేదంలో కూడా విరివిగా వాడుతూ ఉన్నారు.
ప్రతి రోజు అల్లం రసం త్రాగితే ఎన్నో ఆరోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు.ఇప్పుడు పరగడుపున అల్లం రసం త్రాగితే కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.
అల్లంలో యాంటీ డయాబెటిక్ గుణాలు సమృద్ధిగా ఉండుట వలన ప్రతి రోజు అల్లం రసం త్రాగితే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.దాంతో మధుమేహం అదుపులో ఉంటుంది.
అల్లంలో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు సమృద్ధిగా ఉండుట వలన కీళ్ల నొప్పులు, వాపులు తగ్గటమే కాకుండా శరీరంలో చెడు కొలస్ట్రాల్ కూడా తగ్గిపోతుంది.
అల్లం రసం త్రాగటం వలన వికారం, గుండెల్లో మంట, అసిడిటీ, గ్యాస్, అలసట, డయేరియా, అజీర్ణం, ఇన్‌ఫెక్షన్లు, దగ్గు వంటివి రాకుండా కాపాడుతుంది.
అంతేకాక జీర్ణ సంబంధ సమస్యలు లేకుండా చేస్తుంది.
అల్లంలో మెదడుకు ఉత్తేజాన్ని కలిగించే ఫినాల్స్, ఫ్లేవనాయిడ్స్ అనే రసాయనాలు సమృద్ధిగా ఉంటాయి.
అందువల్ల ప్రతి రోజు ఉదయం పరగడుపున అల్లం రసం త్రాగితే మెదడు చురుకుగా పనిచేస్తుంది.వయస్సు పెరుగుతున్న కొద్దీ వచ్చే అల్జీమర్స్, మెంటల్ డిజార్డర్స్ వంటివి రావు.