ముఖ్యంగా చెప్పాలంటే ప్రతి రోజు కొంత మంది దేవాలయానికి వెళ్తూ ఉంటారు.దేవుడిని దర్శించుకునే మనసుకి హాయిగా ఉంటుంది.
మరి కొందరు వారానికి ఒక్కసారైనా దేవాలయానికి వెళ్తారు.అక్కడ పరిస్థితుల్లో ఉండే పాజిటివ్ శక్తి మనలోకి ప్రవేశించి కొత్త ఉత్సాహాన్ని వచ్చేలా చేస్తుంది.
అందుకే దేవాలయాలు పవిత్రమైన ప్రదేశాలు.అలాగే మనసు, ఆలోచనలు పవిత్రంగా చేసే ప్రదేశం దేవాలయం.
కాళ్లు శుభ్రంగా కడుక్కుని దేవాలయంలోకి ప్రవేశిస్తారు.నేరుగా దైవ దర్శనం చేసుకున్నందుకు వెళ్లకుండా ముందుగా గుడి చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణాలు చేస్తారు.
అన్ని దేవాలయాలలో ఇలాగే చేస్తారు.

కానీ శివాలయంలో( Shiva temple )మాత్రం ప్రదక్షిణలు చేసే విధానం భిన్నంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.మహాదేవుడు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తే ఆయన ఉన్నతత్వాన్ని తక్కువ చేసినట్లు అవుతుందని అందుకే గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయకూడదని శాస్త్రాల్లో చెబుతున్నాయి.అలాగే మహాశివరాత్రి రోజు దాదాపు ప్రతి ఒక్కరూ శివాలయానికి వెళ్లి దైవ దర్శనం చేసుకుంటారు.
అలాగే శివార్చన, అభిషేకం, రుద్రాభిషేకం( Shivarchana, Abhishekam, Rudrabhishekam ) వంటి కార్యక్రమాలలో పాల్గొంటారు.అలాగే ఉపవాసం ఉండి రాత్రి జాగారం చేస్తారు.రాత్రంతా దేవాలయంలో ఉండి శివనామ స్మరణలతో ధ్యానం చేస్తారు.

కొంతమంది తప్పనిసరిగా శివనామ స్మరణతో ధ్యానం ప్రదక్షిణలు చేస్తారు.అయితే శివాలయంలో చేసే ప్రదక్షిణలకు సంబంధించిన నియమాలు తప్పనిసరిగా తెలుసుకోవాలి.లింగ పురాణంలో పేర్కొన్న విధంగా మాత్రమే శివాలయంలో ప్రదక్షిణలు చేయాలి.
శివాలయంలో చేసే ప్రదక్షిణలను చండీ ప్రదక్షిణం అని అంటారు.శివాలయంలో ఉండే ధ్వజస్తంభం దగ్గర నుంచి ఎడమ పక్కకు గర్భాలయం వెనుక ఉన్న సోమసూత్రం వరకు వెళ్లి వెనక్కి తిరగాలి.
కానీ సోమసూత్రం మాత్రం దాటకూడదు.మళ్లీ వెనక్కి తిరిగి ధ్వజస్తంభం దగ్గరకు వచ్చి ప్రదక్షణ మొదలు పెట్టాలి.
సోమసూత్రం అంటే గర్భగుడిలో శివునికి అభిషేకం చేసే జలం బయటకు వెళ్లే దారి.పురాణాల ప్రకారం సోమసూత్రన్ని దాటడం వల్ల మీరు చేసే ప్రదక్షిణలకు ఎటువంటి పుణ్యఫలం ఉండదని నిపుణులు చెబుతున్నారు.
అలాగే ప్రదక్షిణలు బేసి సంఖ్యలో అంటే 3, 5, 7 ఇలా ఎన్ని ప్రదక్షిణలు అయినా చేయవచ్చు.