వైరల్: అమ్మాయి పుట్టడంతో వారు పాపకి ఏవిధంగా స్వాగతం పలికారంటే..?!

గడిచిన 35 సంవత్సరాలుగా ఆ ఇంట్లో ఆడపిల్లలు పుట్టుక జరగట్లేదు.  ఇకపోతే తాజాగా దేవుడు కరుణించి 35 సంవత్సరాలు దాటిన తర్వాత వారి ఇంట్లో ఆడపిల్ల పుట్టడంతో ఆ అమ్మాయికి పెద్దఎత్తున అందరి దగ్గర నుండి ఆదరణ దక్కింది.

 Viral Rajasthan Family Hires Helicopter To Bring First Born Baby Girl To Home ,-TeluguStop.com

నిజంగా రాజస్థాన్ రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలలో ఆడపిల్ల పుడితే శాపమని భావించే ఉన్న రోజులలో ఇప్పుడు ఈ సంఘటన జరగడం మరింత ప్రత్యేకంగా నిలుస్తుంది.ఆ పాప వారి గ్రామం రావడానికి కోసం కూడా గ్రామా వాసులు పెద్ద ఎత్తున ఎదురుచూశారు.

ఈ సంఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని నాగౌర్ జిల్లా కు చెందిన మదన్ లాల్ కుటుంబంలో సంభవించింది.

మార్చి నెలలో మదన్ లాల్ కొడుకు హనుమాన్ రామ్ జంటకు ఓ ఆడపిల్ల పుట్టింది.

దీంతో 35 ఏళ్లుగా నిరీక్షిస్తున్న వారి కుటుంబంలో ఆడపిల్ల జన్మించడంతో ఆ కుటుంబం వారు తమ ఇంటికి మహాలక్ష్మి వచ్చిందని ఊరంతా సంబరాలు చేశారు.ఈ సందర్భంగా ఆ గ్రామమంతా వేడుకలు చేసుకోవడం మాత్రమే కాకుండా.

ప్రసవం తర్వాత ఆ చిన్నారిని అమ్మమ్మ ఇంటి నుంచి వచ్చేటప్పుడు చిన్నారి తండ్రి వారు వారికి ఆహ్వానం పలకడానికి పెద్ద ఎత్తున సాంప్రదాయ నృత్యాలు, భజనలు ఏర్పాటు చేశారు.తమ కుటుంబంలోకి అమ్మాయి పుట్టుకను ఓ పెద్ద వేడుకల చేసుకుంటామని అందుకోసం తమ బంధువులందరికీ పిలుపు పంపించామని పాప తండ్రి తెలియజేశాడు.

ఇకపోతే ఆ పాపకు రియా అనే నామకరణం చేశారు.

Telugu Baby, Baby Born, Helicopter, Madan Lal-Latest News - Telugu

ఆ పాపను తమ సొంత గ్రామానికి పాప అమ్మమ్మ గారి ఊరు నుంచి ఏకంగా హెలికాప్టర్ లో తీసుకువచ్చి ఘనమైన ఆహ్వానాన్ని పలికారు తండ్రి కుటుంబ సభ్యులు.ఇది వరకు తాము నివసిస్తున్న ప్రాంతం అంతా అమ్మాయి పుట్టడం ఓ శాపంగా భావించేవారని.ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని, ఈ పరిస్థితులు ఇంకా మారాలని.

ఆడపిల్లలు ఇంటికి వరంగా భావించే పరిస్థితి రావాలని రియ తండ్రి చెప్పుకొచ్చాడు.ఏది ఏమైనా ఇప్పటికీ సమాజంలో ఆడపిల్ల పుడితే అడ్డంకిగా భావించే వారి నడుమ ఇలాంటి ఘటన జరగడం నిజంగా అభినందించతగ్గ విషయమే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube