కార్తికేయ 2 ట్రైలర్.. అంచనాలు పెంచేశారు..!

నిఖిల్ హీరోగా చందు మొండేటి డైరక్షన్ లో వచ్చిన సూపర్ హిట్ మూవీ కార్తికేయ.ఆ సినిమాకు సీక్వల్ గా కార్తికేయ 2 వస్తుంది.

 Nikhil Kartikeya 2 Trailer Released,anupama Parameswaran ,chandu Mondeti, Kartikeya - 2,kartikeya 2 Trailer, Nikhil,tollywood-TeluguStop.com

నిఖిల్ సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్న కార్తికేయ 2 సినిమా ట్రైలర్ ని లేటెస్ట్ గా రిలీజ్ చేశారు చిత్రయూనిట్.కృష్ణుడి జన్మస్థలం ద్వారక బ్యాక్ డ్రాప్ లో కార్తికేయ 2 కథ జరుగుతుందని అర్ధమవుతుంది.

సినిమా ట్రైలర్ ఇంప్రెస్ చేసింది.శాంతను ఇది నువ్వు ఆపలేని యాగం.

ఇందులో నేను ఓ సమిధను మాత్రమే, ఆజ్యం అక్కడ మళ్లీ మొదలైంది అంటూ వచ్చే డైలాగ్ అదిరిపోయింది.

ట్రైలర్ లో వచ్చిన విజివల్స్ కూడా చాలా ఇంప్రెసివ్ గా అనిపించాయి.

కార్తికేయ 2 ఖచ్చితంగా నిఖిల్ ఖాతాలో ఓ సూపర్ హిట్ పడేలా చేస్తుందని చెప్పొచ్చు.ఈ సినిమాను జూలై 22న రిలీజ్ ఫిక్స్ చేశారు.తెలుగుతో పాటుగా తమిళ, హిందీ, కన్నడ, మళయాళ భాషల్లో ఈ మూవీ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.ఇక ఈ మూవీని పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రి, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ బేన‌ర్ లో టి.జి.విశ్వ‌ప్ర‌సాద్, అభిషేక్ అగ‌ర్వాల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube