నిర్మాణం : హారిక అండ్ హాసిని క్రియేషన్స్
నటీనటులు : పవన్ కల్యాణ్, కీర్తిసురేష్ , అను ఇమాన్యుయేల్, బోమన్ ఇరానీ, ఖుష్బూ, రావు రమేష్, మురళీశర్మ, ప్రరాగ్ త్యాగి.వెన్నెల కిషోర్, అజయ్ తదితరులు
సంగీతం : అనిరుధ్
నిర్మాత : ఎస్.రాధాకృష్ణ
ఎడిటింగ్ : కోటగిరి వెంకటేశ్వరరావు.
చాయాగ్రహణం : మణికందన్
దర్శకత్వం : త్రివిక్రమ్ శ్రీనివాస్
పవన్ కళ్యాణ్ సినిమా అంటేనే.అభిమానులకి పండగే.ఇప్పుడు పవన్ సినిమా సంక్రాంతి పండగకి రిలీజ్ అవ్వడం.అదీనూ త్రివిక్రమ్ కాంబో లో రావడంతో ఇప్పుడు అందరి కళ్ళు అజ్ఞాతవాసి సినిమాపైనే ఉన్నాయి.ఈ చిత్రం భారీ అంచానాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
అయితే గతంలో వచ్చిన అత్తారింటికి దారేది సినిమా,జల్సా సినిమాలు లాగా ఈ సినిమా హిట్ అయ్యిందా…? ప్రేక్షకులకి చేరువ అయ్యిందా.? లేదా అనేది తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే
కథ:
ప్రముఖ వ్యాపారవేత్త ,ఏబీ సంస్థలకి అధిపతి గోవింద్ భార్గవ్ అలియాస్ విందా (బొమన్ ఇరానీ).కొంతమంది వ్యక్తులు విందాని, అతని తనయుడిని వ్యాపార లావాదేవీలు కారణంగా హత్య చేస్తారు.దాంతో విందా భార్య ఇంద్రాణి (ఖుష్బూ) కంపెనీ వ్యవహారాలు పర్యవేక్షణ కోసం అస్సాం నుంచీ వచ్చిన బాలసుబ్రమణ్యం(పవన్ కల్యాణ్)ని మేనేజర్‌గా నియమిస్తారు… మేనేజర్ గా వ్యవహారాల్ చూస్తునే విందా హత్యకు కారణాలు వెతుకుతూ ఉంటాడు.
ఇంతకు విందాను హత్య చేసిందెవరు? అస్సాం నుండి ఏబీ మేనేజర్‌గా రావడానికి కారణాలేంటి? బాలసుబ్రమణ్యమెవరు? సీతారామ్(ఆదిపినిశెట్టి) ఎవరు తనకి.ఇంద్రాణి కి బాలసుబ్రహ్మణ్యం మధ్య సంభంధం ఏమిటి అనే విషయాలు తెలియాలి అంటే సినిమాని చూడాల్సిందే.
విశ్లేషణ:
సామాన్యంగా హీరోల చుట్టే కధ అంతా తిరుగుతుంది.అందరికీ తెలిసిన విషయమే.
అందులోనూ పవన్ సినిమా అంటే పవన బేస్ చేసుకునే స్టొరీ ఉంటుంది లేకపోతే అభిమానులకి కిక్ ఎలా వస్తుంది.అయితే బాల సుబ్రహ్మణ్యం , అభిషక్త భార్గవ అనే రెండు షేడ్స్‌లో పవన్ నటన బాగుంది అనే చెప్పాలి.
ఈ సినిమా ఆధ్యాంతమ్ పవన్ భుజాలపైనే నడిచింది అని చెప్పాలి…పవన్ తనదైన నటనతో అభిమానులని అలరించాడు అనే చెప్పాలి.ఈ సినిమాలో చెప్పుకోవలసిన మరొక వ్యక్తి కుష్బూ…ఇంద్రాణి పాత్రలో మెప్పించి ఎంతో చక్కగా ఒదిగిపోయింది…క్లైమాక్స్‌లో ఖుష్బూ నటన ఎంతో అద్భుతంగా ఉంటుంది.
అయితే సినిమాలో హీరోయిన్లు గా చేసిన కీర్తిసురేష్, అను ఇమాన్యుయేల్ గ్లామర్ కోసమే అన్నట్టుగా ఉన్నాయి నటనకు ఏ మాత్రం స్కోప్ లేదు వారికి.
అయితే విలన్ గా నటించిన ఆది మాత్రం తన పాత్రకి పర్ఫెక్ట్ గా న్యాయం చేశాడు అనడంలో నో డౌట్…అయితే ఇక్కడ త్రివిక్రమ్ చేసిన మిస్తకె ఏమిటి అంటే ఆది పాత్రని చాలా బలంగా చేసుంటే పవన్ మరింతగా ఎలివేట్ అయ్యేవాడు.
మురళీశర్మ.రావు రమేష్.పాత్రలు కామెడీకి పరిమితం.మిగిలిన నటులు అందరు వారి పరిమితులకి తగ్గట్టుగా న్యాయం చేశారు.
సాంకేతికంగా చూస్తే.
త్రివిక్రమ్ సినిమా అంటేనే తనదైన డైలాగులతో మెప్పించాడు.
సంభాషణల్లో డెప్త్ కనపడుతుంది.అయితే ప్రతీ సినిమాకి కధ కధనపై దృష్టి పెట్టీ త్రివిక్రమ్ ఈ సినిమాలో కూడా అలానే చేసి ఉంటే బాగుండు అని తెలుస్తోంది.
అయితే విలన్ పాత్రలో బలం లేకపోవడం, హీరోయిన్స్ కి పెద్దగా ఇంపార్టెన్స్ లేకపోవడం వంటి మిస్టేక్స్ ఇవి సగటు ప్రేక్షకుడికి కనిపిస్తాయి.ఇక ఈ సినిమా ద్వారా తెలుగులోకి మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చిన అనిరుధ్ తనదైన స్టైల్లో మంచి సంగీతాన్ని అందించాడు.
మూడు పాటలు బావున్నాయి.ముఖ్యంగా పవన్ పాడిన కొడకా కోటేశ్వరరావా పాట ఆకట్టుకుంటుంది.
అయితే పవన్ – త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ సినిమా కావడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.పెద్ద కంపెనీ యాజమానుల మధ్య పోరు అంటే ఎత్తులు, పై ఎత్తులు ఉండటం.
హీరో ఎంట్రీ వచ్చి తన కుంటుంటాన్ని కాపాడుకోవడం వంటి సన్నివేశాలను చాలా సినిమాల్లో ప్రేక్షకులు చూసేశారు.అయితే సినిమాలో సగటు ప్రేక్షకుడికి సైతం సినిమా కాన్సెప్ట్ అర్థం అయ్యేలా ఉంటుంది సో కధపై వీక్షకుడికి ఆసక్తి ఉండదు.
ఈ సీన్ తరువాత ఈ సీన్ అని చెప్పేయచ్చు కూడా.నిర్మాణ విలువలు పరంగా మంచి నిర్మాత సినిమాకి దొరికాడు అనే చెప్పాలి.
+ లు
– పవన్ కల్యాణ్
– కామెడీ ట్రాక్
– సంగీతం
– ఇంటర్వెల్ ముందు సన్నివేశాలు
– సినిమాటోగ్రఫీ
– లు
– అత్తారింటికి దారేది సినిమా చుసిన్నట్టుగా ఉండటం
– బలమైన కథనం లేకపోవడం
– హీరోయిన్స్ పాత్రలకు తగినంత స్కోప్ కనపడదు
– అసలు కథలో సబ్ ప్లాట్స్ ఎక్కువగా ఉండటం
– హీరో పాత్ర బలంగా లేకపోవడం
బోటమ్ లైన్ – “అజ్ఞాతవాసి” అభిమానుల కోసమేనా
రేటింగ్ – 2 .75 /5