టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరోలో అక్కినేని అఖిల్ ఒకరు.ప్రస్తుతం అఖిల్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘ఏజెంట్’ సినిమా చేస్తూ బిజీగా ఉన్నాడు.
ఈ సినిమా నుండి వచ్చిన ఫస్ట్ లుక్ ఇప్పటికే ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.ఈ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది.
ఈ సినిమాతో మాస్ హీరోగా పేరు తెచ్చుకోవాలని అఖిల్ చాలా మేకోవర్ అయ్యాడు.లుక్ పూర్తిగా మార్చేశాడు.
ఇందులో స్పై పాత్రలో నటిస్తున్న అఖిల్ లుక్ మీద ఇప్పటికే పాజిటివ్ వైబ్స్ వచ్చాయి.కండలు తిరిగిన బాడీతో గుబురు గడ్డంతో ఒత్తయిన జుట్టుతో అఖిల్ హాలీవుడ్ హీరోలా కనిపిస్తూ ఈ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచుతున్నాడు.
ఈ సినిమా మొత్తం హాలీవుడ్ యాక్షన్ రేంజ్ లో విన్యాసాలు ఉండబోతున్నాయని ఈ సినిమా ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుందని ధీమాగా ఉన్నారు.

