చేసింది తక్కువ సీరియల్స్ అయినా బుల్లితెరపై సీరియల్ నటి నవ్యస్వామికి ఉన్న పాపులారిటీ అంతాఇంతా కాదు.ఈటీవీలో నా పేరు మీనాక్షి సీరియల్ తో పాటు స్టార్ మా ఛానెల్ లో ఆమె కథ సీరియల్ ద్వారా నవ్యస్వామికి ఓ రేంజ్ లో క్రేజ్ ఉంది.
వెండితెరపై అభినయానికి ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో ఎక్కువగా నటించిన నవ్యస్వామి సోషల్ మీడియాలో మాత్రం గ్లామరస్ లుక్ తోనే ఎక్కువగా దర్శనమిస్తూ ఉంటారు.
ఛానెళ్ల ప్రసారమవుతున్న ఈవెంట్లలో కూడా సందడి చేస్తూ నవ్యస్వామి ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటున్నారు.
ఎలాంటి పాత్రనైనా అద్భుతంగా చేయగల టాలెంట్ ఉన్న ఈ బ్యూటీ బిగ్ బాస్ ఆఫర్ కు నో చెప్పినట్టు తెలుస్తోంది.అయితే షో నిబంధనల వల్ల నవ్యస్వామి షోలో పాల్గొనలేనని తేల్చి చెప్పినట్టు సమాచారం.
బిగ్ బాస్ షోలో పాల్గొంటే షో నుంచి బయటకు వచ్ఛిన కొన్ని నెలల వరకు ఇతర ఛానెల్స్ ప్రోగ్రామ్ లలో పాల్గొనకూడదు.
ఇతర ఛానెల్స్ లో సీరియల్స్ చేసే అవకాశం ఉండదు.నవ్యస్వామి బిగ్ బాస్ ఆఫర్ కు ఓకే చెబితే బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక ఇబ్బంది పడాల్సి ఉంటుంది.ఈ రీజన్స్ వల్లే ఈ బ్యూటీ బిగ్ బాస్ ఆఫర్ ను రిజెక్ట్ చేసినట్టు తెలుస్తోంది.
నవ్యస్వామి బిగ్ బాస్ షోలో పాల్గొని ఉంటే మాత్రం షోపై క్రేజ్ ప్రేక్షకుల్లో మరింత పెరిగి ఉండేదని చెప్పవచ్చు.నవ్యస్వామికి రోజుల తరబడి ఒకే ఇంట్లో ఉండటం ఇష్టం లేదని ఆ రీజన్ వల్లే ఈ షో ఆఫర్ ను రిజెక్ట్ చేసిందని సమాచారం.
నవ్యస్వామి బిగ్ బాస్ షోలో పాల్గొనడం లేదని తెలిసి ఆమె ఫ్యాన్స్ నిరుత్సాహపడుతున్నారు.భవిష్యత్తులో సినిమాల్లో కూడా నవ్యస్వామికి ఆఫర్లు వస్తాయేమో చూడాల్సి ఉంది.