న్యూజెర్సీ : మరోసారి ఎడిషన్ మేయర్ రేసులో సామ్ జోషి .. ప్రవాస భారతీయుల మద్ధతు

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం అమెరికాకు వెళ్లిన భారతీయులు అక్కడ అత్యున్నత స్థానాలకు చేరుకుంటున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే మేయర్లు, కౌన్సిలర్లు, సెనేటర్లు(Mayors, councilors, senators), ప్రతినిధుల సభ సభ్యులుగా , కేబినెట్ మంత్రులుగా పలు హోదాలలో పనిచేస్తున్నారు భారతీయులు.

 Indian American Community Playing Important Role In Re-election Of Edison Mayor-TeluguStop.com

కొద్దిలో మిస్ అయ్యింది కానీ .లేదంటే ఈ ఏడాది అమెరికా అధ్యక్షురాలిగా భారత సంతతికి చెందిన కమలా హారిస్ (kamala Harris)కొలువుదీరేవారు.ఇక ట్రంప్(trump) అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత పలువురు ప్రవాస భారతీయులకు కీలక బాధ్యతలు అప్పగంచిన సంగతి తెలిసిందే.

ఇకపోతే.

న్యూజెర్సీలోని ఎడిషన్‌కు(edition in New Jersey) మొదటి ఇండో అమెరికన్‌ మేయర్‌గా చరిత్ర సృష్టించిన సామ్ జోషి(Sam Joshi) మరోసారి ఎన్నికల బరిలో నిలిచారు.ఆయన పదవీకాలం డిసెంబర్ 2025తో ముగుస్తుంది.

ఎడిషన్‌లో స్ధిరపడిన ప్రవాస భారతీయులు జోషి ప్రచారంలో కీలకపాత్ర పోషిస్తున్నారు.తాను మేయర్‌గా ఉన్నప్పుడు ఆసియా అమెరికన్లు, భారతీయ అమెరికన్లు(Asian Americans, Indian Americans) నాకు చాలా అండగా నిలిచారని, ఇప్పుడు ప్రచారంలోనూ వారు కీలకపాత్ర పోషిస్తున్నారని జోషి తెలిపారు.

తన ప్రచారంలో పెద్ద ఎత్తున భారతీయ అమెరికన్ యువకులు పాల్గొంటున్నారని.ఇంటర్న్‌షిప్‌లు చేస్తున్నారని ఆయన ప్రశంసించారు.

వీరంతా ఏదో రోజున నాలాగే మేయర్‌గా పనిచేస్తారని జోషి చెప్పారు.

Telugu Asian Americans, Councilors, Edisonmayor, Kamala Harris, Mayor Sam Joshi,

మేయర్‌గా గడిచిన మూడేళ్లుగా తాను ఆర్ధిక బాధ్యతను పాటించానని ఆయన తెలిపారు.రికార్డు స్థాయిలో అధిక ద్రవ్యోల్భణం ఉన్నప్పటికీ.ఆస్తి పన్నులను ఫ్లాట్‌గా ఉంచగలిగానని ఆయన తెలిపారు.

కొత్త వాటర్ పార్క్‌ ఏర్పాటు చేయడంతో పాటు పట్టణంలో పార్క్‌లను మెరుగ్గా ఉంచినట్లు జోషి చెప్పారు.మేయర్‌గా గడిచిన మూడేళ్ల కాలంలో మౌలిక సదుపాయాల మెరుగుదలలు, రోడ్ల పునరుద్ధరణతో పాటు పెట్టుబడుల పెంపు, సీనియర్ సిటిజన్‌లకు సేవలను పెంచడం, ఎడిషన్‌లో ఇంటర్నెట్ గుత్తాధిపత్యాన్ని ముగించడం వంటి కార్యక్రమాలను చేపట్టడం వంటివి మేయర్‌గా ఆయన సాధించిన విజయాలు.

జాత్యహంకార దాడులు, వివాదాలను చూసిన ఎడిషన్‌లో భారతీయ అమెరికన్ జనాభా ఎక్కువ.అయినప్పటికీ తన ప్రచారంలో అలాంటి అంశాలను హైలైట్ చేయనని జోషి తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube