ఈ రోజుల్లో బయటికి వెళ్తే చాలు చాలామంది మగవాళ్ళు అమ్మాయిలు వెంటపడుతున్నారు.అయితే సోషల్ మీడియా(social media) ఇన్‌ఫ్లుయెన్సర్ లీలా లేజెల్ (Leila Layzell)తెలివైన టెక్నిక్ తో తనని వేధించే ఒక మగ వ్యక్తి నుంచి తప్పించుకుంది.
బ్రిటీష్ టూరిస్ట్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్(British tourist, social media influencer) అయిన లీలా లేజెల్, సిడ్నీలోని బాండీ బీచ్‌లో ఒక వ్యక్తి నుంచి ఎదురైన వేధింపులను తెలివిగా తిప్పికొట్టింది.ఆమె టెక్నిక్ కి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
ఆమె ఆన్‌లైన్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియో 5 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఒక వ్యక్తి పదే పదే ఫోన్ నంబర్ అడుగుతుంటే, లీలా లేజెల్ (Leila Layzell)దానిని చాలా చాకచక్యంగా, ఫన్నీగా ఎలా తప్పించుకుందో చూపించింది.
అతనిని ఇగ్నోర్ చేయడం లేదంటే కోపంగా సమాధానం చెప్పడం చేయలేదు.బదులుగా “మా అమ్మకి, నా భర్తకి చూపించనా?” అని సరదాగా అడిగింది.ఆమె నవ్వుతూ, ఊహించని ప్రశ్న అడగడంతో అతను ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు.సిగ్గుతో ముఖం కప్పుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.
కాబట్టి అమ్మాయిలూ, ఇలాంటి సందర్భాల్లో తెలివిగా వ్యవహరించడానికి ఇది ఒక మంచి ఉదాహరణ అని వీడియో చూసిన నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
లీలా తెలివికి నెటిజన్లు ఫిదా అయిపోయారు.ఆమె ప్రవర్తించిన తీరుకు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.ఒక ఇబ్బందికరమైన పరిస్థితిని ఎంత తేలికగా, నవ్వుతూ పరిష్కరించిందో అని అందరూ మెచ్చుకుంటున్నారు.
ఒత్తిడితో కూడిన క్షణాన్ని ఫన్నీగా మార్చేస్తూ, ఆమె ప్రశాంతంగా ఉన్న విధానానికి చాలామంది అభిమానులైపోయారు.ఇక ఈ వీడియో కామెంట్ సెక్షన్ రకరకాల చర్చలతో నిండిపోయింది.ఆ వ్యక్తి అంత తొందరగా ఎందుకు వెళ్ళిపోయాడో అని అందరూ ఒకటే ప్రశ్నలు.కొందరైతే అతని ప్రవర్తనను విశ్లేషిస్తూ కామెంట్లు పెడుతున్నారు.
ఒక నెటిజన్ అయితే ఇంకాస్త ముందుకెళ్లి “అతను ముఖం చూపించడానికి అంతలా భయపడుతున్నాడంటే, కచ్చితంగా పెళ్ళైనవాడై ఉంటాడు లేదా ఏదో తేడా కొడుతోంది” అని కుండబద్దలు కొట్టాడు.
లీలా కూడా ఈ చర్చలో భాగమయ్యింది.“ఇకపై ఎవరైనా మగాడు నన్ను ఇబ్బంది పెట్టినా, నా నంబర్ కోసం వేధించినా, ఇదే ట్రిక్ నా ఆయుధం.ఇది సూపర్ గా పనిచేస్తుంది!” అని గట్టిగా చెప్పింది.
మరో నెటిజన్ తన వంతుగా, “అతను అస్సలు సీరియస్‌గా లేడు.ఎలాంటి కమిట్‌మెంట్ లేకుండా, దొంగచాటుగా ఫ్లర్ట్ చేయాలనుకుంటున్నాడు అంతే” అని తేల్చి చెప్పాడు.
లీలా ఇచ్చిన తెలివైన సమాధానం ఎంతోమంది అమ్మాయిలకు స్ఫూర్తినిచ్చింది.ఇలాంటి ఇబ్బందికర పరిస్థితుల్లో నవ్వుతూ, తెలివిగా ఎలా తప్పించుకోవాలో నేర్పించింది.