మెల్‌బోర్న్ టెస్టులో షాకింగ్ సంఘటన.. విరాట్ కోహ్లీని ఆలింగనం చేసేందుకు ప్రయత్నించిన ప్రేక్షకుడు

మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) (Melbourne Cricket Ground (MCG))వేదికగా ఆస్ట్రేలియా-భారత్(Australia-India) జట్ల మధ్య జరుగుతున్న టెస్టు రెండో రోజు ఆటలో అనుకోని ఘటన చోటుచేసుకుంది.ఫీల్డింగ్ చేస్తున్న టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ(Virat Kohil) వైపు ప్రేక్షకుల్లోని ఒక వ్యక్తి మైదానంలోకి దూసుకువచ్చాడు.

 Shocking Incident In Melbourne Test.. Spectator Tries To Hug Virat Kohli, Social-TeluguStop.com

కోహ్లీని ఆలింగనం చేసుకునేందుకు అతను యత్నించడంతో ఆటకు కాసేపు అంతరాయం కలిగింది.ఈ ఘటనతో స్టేడియం మొత్తం ఆందోళనకు గురైంది.

అయితే, సెక్యూరిటీ సిబ్బంది వెంటనే అప్రమత్తమై మైదానంలోకి వచ్చి సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకొని బయటకు తరిమేశారు.

మొదట రోహిత్ శర్మ(Rohit Sharma) వైపు వచ్చిన అతన్ని భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు.కానీ, విరాట్ కోహ్లీ (virat kohli)దగ్గరకు వెళ్లి హగ్ చేసేందుకు ప్రయత్నించడంతో, అతడిని వెంటనే మైదానం నుంచి బయటకు తీసుకువెళ్లారు.అనంతరం ఆట తిరిగి ప్రారంభమైంది.

మొదటి రోజు ఆటలో విరాట్ కోహ్లీ, ఆస్ట్రేలియా పేసర్ కాన్ స్టార్క్(Virat Kohli and Australian pacer Conn Starc) మధ్య స్వల్ప వాగ్వాదం జరిగిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో రెండో రోజు మెల్‌బోర్న్ స్టేడియంలో భారీగా కూడిన 85,000 మంది ప్రేక్షకులు కోహ్లీ పేరును హోరెత్తించారు.

కోహ్లీ కూడా అభిమానుల ప్రోత్సాహానికి సైగలతో స్పందించాడు.

ఇక రెండో రోజు ఆట ముగిసే సమయానికి తొలి రోజులాగే రెండో రోజు కూడా మెల్‌బోర్న్‌లో ఆస్ట్రేలియా ఆధిపత్యం కనిపించింది.తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా స్కోరు 311/6.అంతకుముందు ఆడుతున్న స్టీవ్ స్మిత్ సెంచరీ చేయడంతో ఆస్ట్రేలియా అన్ని వికెట్లు కోల్పోయి 474 పరుగులు చేసింది.

ఇంకా మొదటి ఇన్నింగ్స్ ను మొదలు పెట్టిన టీమిండియా 164/౫ వద్ద ఉంది.భారత్ తొలి ఇన్నింగ్స్‌లో ఇంకా 310 పరుగులు వెనుకబడి ఉంది.ఫాలో ఆన్‌ను కాపాడుకోవడానికి 111 పరుగులు చేయాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube