ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్రాంతి పండుగ కానుకగా రిలీజ్ కానున్న సినిమాలైన గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం( game changer, Daku Maharaju, Sankrantiki vastunnam ) సినిమాకు టికెట్ రేట్ల పెంపు భారీగా ఉండే ఛాన్స్ ఉందని అదే సమయంలో భారీ సంఖ్యలో బెనిఫిట్ షోలు సైతం ప్రదర్శితం అయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.తెలుగు రాష్ట్రాల్లోని సినిమాలకు ఎక్కువ మొత్తం కలెక్షన్లు ఏపీనుంచి వస్తాయనే సంగతి తెలుస్తోంది.
పెద్ద సినిమాలకు ఆంధ్ర, సీడెడ్ ఏరియాలలో( Andhra, in seeded areas ) ప్రస్తుతం 100 నుంచి 130 కోట్ల రూపాయల రేంజ్ లో బిజినెస్ జరుగుతోంది.తెలంగాణలో బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపులకు అనుమతులు లేకపోవడంతో ఏపీపైనే సినిమా పెద్దలు ఆశలు పెట్టుకున్నారు.
నైజాంలో పెద్ద సినిమాల కలెక్షన్లు ఏ విధంగా ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది.నిర్మాత దిల్ రాజు (Produced by Dil Raju )సీఎం రేవంత్ రెడ్డిని రిక్వెస్ట్ చేసి టికెట్ రేట్ల పెంపు దిశగా అడుగులు వేస్తారేమో చూడాలి.
ఫస్ట్ వీకెండ్ వరకు టికెట్ రేట్ల పెంపునకు అనుమతులు వచ్చినా చాలని కామెంట్లు వినిపిస్తున్నాయి.పెద్ద సినిమాలకు ప్రస్తుత కాలంలో ఫస్ట్ వీకెండ్ కలెక్షన్లు కీలకమవుతున్నాయి.పవన్ వల్ల గేమ్ ఛేంజర్ కు, చంద్రబాబు వల్ల డాకు మహారాజ్ కు, వెంకటేశ్ కు టీడీపీ నేతలతో సన్నిహిత సంబంధాల వల్ల సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు టికెట్ రేట్ల విషయంలో ఏపీలో సమస్య లేదు.
ఈ మూడు సినిమాలు సక్సె సాధించి 2025 సంవత్సరానికి టాలీవుడ్( Tollywood ) ఇండస్ట్రీకి శుభారంభాన్ని ఇవ్వాలని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.సంవత్సరం సంవత్సరానికి సినిమాల బడ్జెట్లు పెరుగుతున్నాయి.ఏపీలో సినిమా రిలీజ్ సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రభుత్వం చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉందని కూడా కొంతమంది నెటిజన్లు సూచనలు చేస్తుండగా ఆ కామెంట్లు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.