ఈ ఏడాది కొన్ని నెలల గ్యాప్ లోనే విడుదలైన దేవర, పుష్ప ది రూల్ ( Devara, Pushpa The Rule )సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి.ఈ రెండు సినిమాలు కలెక్షన్ల విషయంలో సైతం అదరగొట్టాయనే సంగతి తెలిసిందే.
పుష్ప ది రూల్ మూవీ 22 రోజుల కలెక్షన్ల వివరాలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.ఈ సినిమాకు ఇప్పటికే 1719 కోట్ల రూపాయల కలెక్షన్లు వచ్చాయి.
ఈ సినిమా 2000 కోట్ల రూపాయల కలెక్షన్లను సొంతం చేసుకుంటుందని ఫ్యాన్స్ భావించగా అందుకు భిన్నంగా జరిగింది.ఈ సినిమా ఆ మార్క్ ను అందుకోవడం కష్టమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
దేవర సినిమా బాక్సాఫీస్ వద్ద 550 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సాధించగా ఆ సినిమాకు మూడు రెట్ల కలెక్షన్లను ఈ సినిమా సొంతం చేసుకోవడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.
పుష్ప ది రూల్ బాహుబలి2, దంగల్ ( Baahubali 2, Dangal )కలెక్షన్ల రికార్డులను బ్రేక్ చేస్తుందా? లేదా? అనే చర్చ సైతం సోషల్ మీడియా వేదికగా జరుగుతుండటం గమనార్హం.బన్నీ సినిమా రిలీజ్ తర్వాత ప్రమోషన్స్ లో పెద్దగా పాల్గొనకపోయినా ఈ సినిమా మాత్రం కలెక్షన్ల విషయంలో అదరగొట్టిందనే చెప్పాలి.బన్నీ ఖాతాలో బ్యాక్ టు బ్యాక్ హిట్లు చేరడం అభిమానులకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని చెప్పవచ్చు.
స్టార్ హీరో బన్నీకి క్రేజ్ అంతకంతకూ పెరుగుతుండగా బన్నీ భవిష్యత్తు ప్రాజెక్ట్ మైథలాజికల్ కాన్సెప్ట్ తో తెరకెక్కనుంది. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ( Star director Trivikram Srinivas )తర్వాత సినిమాలతో ఏ స్థాయిలో మ్యాజిక్ చేస్తారో చూడాల్సి ఉంది.గుంటూరు కారం ఆశించిన ఫలితాన్ని అందుకోని నేపథ్యంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ తర్వాత సినిమా స్క్రిప్ట్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.బన్నీ కెరీర్ ను అద్భుతంగా ప్లాన్ చేసుకుంటున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి.