థాయ్‌లాండ్: ఫుల్ మూన్ పార్టీ గురించి ఈ నిజాలు తెలిస్తే వాంతి చేసుకుంటారు..

థాయ్‌లాండ్‌లోని కో ఫా న్గన్( Koh Phangan, Thailand ) పేరు వింటేనే పున్నమి వెలుగులో హోరెత్తే పార్టీలు కళ్ల ముందు కదలాడుతాయి.హ్యాడ్ రిన్ బీచ్‌లో జరిగే ఈ వేడుకకు ప్రపంచం నలుమూలల నుంచి వేలాది మంది తరలి వస్తారు.

 If You Know These Facts About Thailand Full Moon Party, You Will Vomit, Full Moo-TeluguStop.com

డీజేల మోత, యువత కేరింతలతో ఆ ప్రాంతమంతా సందడిగా మారుతుంది.ఇది చాలా మందికి డ్రీమ్ డెస్టినేషన్( dream destination ).కానీ, ఈ వినోదం వెనుక ఓ విషాదకరమైన నిజం దాగుంది.

ట్రావెల్ ఇన్‌ఫ్లుయెన్సర్ గ్రాంట్ బార్న్స్ ( Travel influencer Grant Barnes )ఇటీవల షాకింగ్ వీడియోతో ఈ నిజాల్ని బయటపెట్టారు.పైకి నునుపుగా, అందంగా కనిపించే బీచ్‌లు మలంతో నిండి ఉన్నాయని ఆయన బాంబు పేల్చారు.“చూడటానికి ఎంత బాగుందో కదా? కానీ ఇది మలంతో నిండి ఉంది” అంటూ బార్న్స్ చేసిన వ్యాఖ్య సోషల్ మీడియాలో వైరల్ అయింది.ఫుల్ మూన్ పార్టీల సమయంలో వచ్చే జనం తాకిడికి అక్కడి మురుగునీటి వ్యవస్థ కుప్పకూలిపోతోందని, చాలామంది సముద్రంలోనే మూత్ర, మల విసర్జన చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.దీనివల్ల సముద్రపు నీరు కలుషితం అవుతోందని, పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లుతోందని ఆయన హెచ్చరించారు.

పైకి స్వచ్ఛంగా సముద్రం కనిపిస్తుంది కానీ కానీ, పార్టీ జరిగేటప్పుడు మాత్రం అందులో కాలు పెట్టాలంటేనే జడుసుకోవాల్సిందే అంటున్నారు ట్రావెల్ ఇన్‌ఫ్లుయెన్సర్ గ్రాంట్ బార్న్స్.“నీళ్లలోకి పొరపాటున కూడా వెళ్లకండి!” అంటూ ఆయన చేసిన హెచ్చరిక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.స్థానిక మీడియా కూడా ఈ నీటి కాలుష్యం గురించి భయంకరమైన విషయాలు వెల్లడించింది.ఆ నీటిని “నురుగు నల్ల నీరు” అంటూ వర్ణించింది.అంతేకాదు, ఈ మురుగు నీటి ప్రవాహం పగడపు దిబ్బలను నాశనం చేస్తూ పర్యావరణానికి పెను ప్రమాదం కలిగిస్తోందని బార్న్స్ ఆందోళన వ్యక్తం చేశారు.

ఒకప్పుడు కేవలం 30 మందితో ప్యారడైజ్ బంగళాస్‌లో( Paradise Bungalows ) మొదలైన చిన్న పార్టీ నేడు దాదాపు 30,000 మందితో హోరెత్తిపోతోంది.1985లో మొదలైన ఈ ఫుల్ మూన్ పార్టీ ఇప్పుడు వినోదానికి కేరాఫ్ అడ్రస్‌గా మారింది.కానీ, ఈ పార్టీల తర్వాత హ్యాడ్ రిన్ బీచ్ పరిస్థితి మాత్రం దారుణంగా ఉంటోంది.

సోషల్ మీడియాలో చాలామంది ఈ వేడుకను తీవ్రంగా విమర్శిస్తున్నారు.కొందరు అసహ్యకరమైన, వాంతి తెప్పించే చర్యగా అభివర్ణిస్తుంటే, మరికొందరు థాయ్‌లాండ్ ప్రభుత్వం పర్యావరణాన్ని కాపాడాలని, బీచ్‌ల పరిశుభ్రతకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube