కన్నడ సినీ నటుడు శివకుమార్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం వేద.ఈ సినిమా కన్నడ చిత్ర పరిశ్రమలో గత ఏడాది విడుదలై ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది.
ఇక ఈ సినిమాని తెలుగులో ఈ నెల 9వ తేదీ ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమయ్యారు.ఈ క్రమంలోనే ఈ సినిమా వేడుకను హైదరాబాదులో ఎంతో ఘనంగా నిర్వహించారు.
ఇక ఈ కార్యక్రమానికి నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఇక ఈ కార్యక్రమంలో భాగంగా నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ ఈ సినిమాకి శివరాజ్ కుమార్ సతీమణి నిర్మాతగా వ్యవహరించడంతో ఈయన అభినందించారు.కన్నడ చిత్ర పరిశ్రమలో ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకున్న ఈ సినిమా ఇక్కడ కూడా మంచి విజయాన్ని అందుకోవాలని ఈయన ఆకాంక్షించారు.ఒకరి ఆలోచనలు మరొకరితో పంచుకుంటేనే మంచి కథలు వస్తాయి.‘నేను పట్టిన కుందేలుకు మూడు కాళ్లే అన్నట్టు నేను చెప్పిందే కథ’ అనుకుంటే మంచి సినిమాలు ఎప్పటికీ రావని బాలకృష్ణ తెలిపారు.

ఇక వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడం అంటే ఎంతో కష్టమైన పని అని కానీ రాజ్ కుమార్ వారసత్వాన్ని శివరాజ్ కుమార్, రాఘవేంద్ర రాజ్ కుమార్, పునీత్ రాజ్ కుమార్ ఎంతో విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారని తెలిపారు.నటుడు పునీత్ రాజ్ కుమార్ కూడా గుండెపోటుతో మరణించిన విషయం మనకు తెలిసిందే.పునీత్ గురించి బాలయ్య మాట్లాడుతూ.
ప్రస్తుతం పునీత్ మన మధ్య లేకపోయినా ఆయన స్థానం ఎప్పటికీ ఆయనదేనని తెలిపారు.మనం ఏ చిన్న పని చేసిన ఈ పని చేస్తున్నామని చెప్పుకుంటాం కానీ పునీత్ ఎన్నో సేవా కార్యక్రమాలను ఎలాంటి ఆర్భాటాలు లేకుండా చేశారంటూ ఈ సందర్భంగా పునీత్ రాజ్ కుమార్ ను గుర్తు చేసుకున్నారు.
ఇలా ఈ వేడుకలో బాలయ్య చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.