ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా బాగా డెవలప్ అవ్వడంతో అభిమానులకు సెలబ్రెటీలకు మధ్య ఉన్న వ్యత్యాసం చాలా వరకు తగ్గిపోయింది.చాలామంది అభిమానులు వారి అభిమాన హీరో హీరోయిన్ల విషయాలను తెలుసుకోగలుగుతున్నారు.
సెలబ్రిటీలు కూడా అభిమానులతో కలిసి సరదాగా చిక్ చాట్ చేయడం లైవ్ చాట్ చేయడం లాంటివి చేస్తున్నారు.అంతే కాదండోయ్ సెలబ్రిటీలు వారికి సంబంధించిన ఫోటోలను వీడియోలను అభిమానులతో పంచుకోవడానికి ఆసక్తిని చూపిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే ఈ మధ్యకాలంలో చాలా వరకు హీరో హీరోయిన్లు వారు చిన్ననాటి ఫోటోలను చేసిన మీడియాలో షేర్ చేస్తున్నారు.

అలా ప్రస్తుతం ఇండస్ట్రీలో త్రో బ్యాక్ ట్రెండ్ నడుస్తోంది.ఈ విషయం పక్కన పెడితే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.ఆ ఫోటోలో పాన్ ఇండియా స్టార్ సాగర తీరాన సముద్రం వైపు తిరిగి ఏదో ఆలోచిస్తూ నిలబడ్డారు.
దీంతో ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది.మరి సాగర తీరాన నిలబడి ఆలోచిస్తున్న ఈ పాన్ ఇండియా స్టార్ మరెవరో కాదు.2021లో విడుదల అయిన పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిన అల్లు అర్జున్. ఈ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు అల్లు అర్జున్.

అంతేకాకుండా ఈ సినిమా కోట్లల్లో కలెక్షన్స్ రాబట్టిన విషయం తెలిసిందే.ఇకపోతే ప్రస్తుతం బన్నీ పుష్ప 2 సినిమా చిత్రీకరణ షూటింగ్ లో పాల్గొంటున్నారు.ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ విశాఖపట్నంలో జరుగుతోంది.ఈ క్రమంలోనే అలా సరదాగా సముద్రతీరానికి వెళ్లిన అల్లు అర్జున్ అక్కడ తీసుకున్న ఫోటోని షేర్ చేస్తూ థాంక్స్ వైజాగ్ అనే క్యాప్షన్ కూడా జోడించారు.
ఇప్పటికే పుష్ప పార్ట్ 1 సినిమా రికార్డుల మీద రికార్డులు సృష్టించిన విషయం తెలిసిందే.దీంతో ఈ సినిమా పార్ట్ 2 ఎప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.







