భారత్, ఆస్ట్రేలియా మధ్య జరగనున్న బోర్డర్-గవాస్కర్ సిరీస్ గురించి వాడివేడిగా బయట, నెట్టింట్లో చర్చలు జరుగుతున్నాయి.అంతేకాకుండా క్రికెట్ పండితులు తమ అంచనాలు కూడా చెబుతున్నారు.
ఈ క్రమంలో బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో డబుల్ సెంచరీలు చేసిన మాజీ భారత ఆటగాళ్ల గురించి ఖచ్చితంగా మీరు తెలుసులుకోవాలి.బోర్డర్ గవాస్కర్ సిరీస్‌లో ఆడిన మన మాజీ ఆటగాళ్లు VVS లక్ష్మణ్, సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, మహేంద్ర సింగ్ ధోనీ, గౌతమ్ గంభీర్ డబుల్ సెంచరీలు సాధించిన విషయం మీకు తెలుసా?.
2001లో VVS లక్ష్మణ్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో 281, అదేవిధంగా 2008లో 200 (నాటౌట్) పరుగులు సాధించాడు.అదేవిధంగా 2004లో ఇదే ట్రోఫీలో సచిన్ టెండూల్కర్ 241 (నాటౌట్), 2010లో 214 పరుగులు చేయడం విశేషంగా చెప్పుకోవచ్చు.ఇక ప్రస్తుత భారత ప్రధాన కోచ్ అయినటువంటి రాహుల్ ద్రవిడ్ 2003లో ఇదే సిరీస్‌లో ఆడుతున్నప్పుడు 224 పరుగులు సాధించి సంచలనం సృష్టించాడు.ఇక 2008లో గౌతమ్ గంభీర్ 206 పరుగులు, 2013లో మహేంద్ర సింగ్ ధోని 224 పరుగులు సాధించాడు.
ఇకపోతే 2023 బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఫిబ్రవరి 9వ తేదీ నుంచి 13వ తేదీ మధ్య నాగ్‌పూర్‌లో భారత్, ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టు మ్యాచ్ జరగనుందనే విషయం విదితమే.తర్వాత ఫిబ్రవరి 17వ తేదీ నుంచి ఫిబ్రవరి 21వ తేదీ మధ్య ఢిల్లీలో రెండో టెస్టు, మార్చి ఒకటో తేదీ నుంచి మార్చి 5వ తేదీ దాకా ధర్మశాలలో 3వ టెస్టు జరగనుంది.అదేవిధంగా మార్చి 9వ తేదీ నుంచి 13వ తేదీ దాకా అహ్మదాబాద్ వేదికగా నాలుగో టెస్టు, దీని తర్వాత రెండు జట్లూ మూడు వన్డేల సిరీస్ కూడా ఆడనున్నాయి.ఈ సిరీస్‌లో తొలి వన్డే ముంబైలో, రెండో వన్డే విశాఖపట్నంలో, మూడో వన్డే చెన్నైలో జరగనుంది.