మీరు తాగే కప్పు టీ కల్తీ కావొచ్చు, అందుకు కారణం ఇక్కడ ఉంది

శతాబ్దాలుగా ‘ఛాయ్‌’ ఓ పానీయంగా మన సంస్కృతిలో అంతర్భాగంగా ఉంది.ప్రపంచంలో టీ ఉత్పత్తిలో రెండవ అతి పెద్ద దేశంగా, సరిహద్దులు, సంస్కృతులు, వయసు తరగతులతో సంబంధం లేకుండా భారతదేశపు అభిమాన రిఫ్రెష్‌మెంట్‌గా టీ నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహమూ లేదు.

 Shocking Facts About Tea Adulteration, Tea Adulteration, Tea, Tea Powder, Adulte-TeluguStop.com

ఎక్కువ మంది అభిమానించే పానీయాలలో ఒకటిగా టీ ను బహుళ వాటాదారులు, సంస్థలు, రైతులు వివిధ ప్రాంతాలలో సాగు చేయడం, ఉత్పత్తి చేయడంతో పాటుగా విభిన్న రుచుల అవసరాలను తీరుస్తున్నారు.

కానీ, మీరు ప్రతి కప్పునూ ఎంతగానో ఆస్వాదించాలని కోరుకునే టీ లో ప్రమాకరమైన కల్తీ అంశాలు కూడా ఉంటాయంటే ? టాటా టీ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా అధ్యయనాల ప్రకారం, అన్‌ బ్రాండెడ్‌ లూజ్‌ టీలో కల్తీ కారకాలు ఎక్కువగా ఉంటాయి.వీటి కారణంగా ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు.

రద్దీ జీవనశైలి కారణంగా ఆహారంలో కల్తీ కూడా గణనీయంగా పెరిగింది.

ఇది ఓ మమహ్మారిలా మారడంతో పాటుగా ఎంతో మంది వినియోగదారులపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుంది.ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) వార్షిక నివేదిక 2018–19 ప్రకారం ఆహార పదార్ధాలలో కల్తీ అనేది రెట్టింపు కంటే ఎక్కువగా ఉందిప్పుడు.2011–12 సంవత్సరంలో 12.8% కల్తీ జరిగితే, 2018–19 సంవత్సరానికి అది 28%కు చేరింది.అధికశాతం మంది భారతీయులు తమకు తెలియకుండానే కల్తీ ఆహారాన్ని ఇష్టంగా తింటున్నారు.

సుదీర్ఘకాలం పాటు కల్తీ ఆహారం తీసుకోవడం అంటే కల్తీ చేయబడిన టీ లాంటివి తీసుకోవడం వల్ల అది మన శరీరంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది.

ప్యాక్‌లలో కాకుండా బయట అమ్మే టీ లలో సాధారణంగా జరిగే కల్తీ కృత్రిమ రంగులను జోడించడం.పాడైన తేయాకు మరియు నాణ్యత లేని ఆకులను తరుచుగా ఎండబెట్టి వాటికి కృత్రిమ రంగులు జోడించి నాణ్యమైన టీగా విక్రయిస్తుంటారు.

నాణ్యతను నాశనం చేయడంతో పాటుగా ఆ ఉత్పత్తి యొక్క రుచి పోవడంతో పాటుగా తీవ్రమైన ఆరోగ్య సమస్యలు సైతం వచ్చే అవకాశాలున్నాయి.ప్రమాదకరమైన కలరింగ్‌ ఏజెంట్లు వాడిన టీ వల్ల ఈ తరహా సమస్యలు ఎదురుకావొచ్చు.

టాటా టీ జెమిని కోసం న్యూట్రిషన్‌ ఎడ్వైజర్‌గా సేవలనందిస్తోన్న కవితా దేవగన్‌ లూజ్‌ టీ లో కల్తీ ప్రభావం గురించి మాట్లాడుతూ ‘‘ప్రతి రోజూ టీ తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను గురించి చాలామందికి తెలుసు.అయితే, కల్తీ టీ వల్ల కలిగే ప్రమాదకరమైన ప్రభావాలను గురించి వినియోగదారులకు పూర్తి స్థాయిలో అవగాహన ఉన్నప్పటికీ, పలు కారణాల రీత్యా చాలామంది ఈ తరహా టీ కొనుగోలు చేసి తాగుతుంటారు.

టీ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా, ఇప్పటికీ ఎలాంటి రంగులు జోడించని టీ మాత్రమే వినియోగించాల్సిందిగా సూచిస్తుంది.కల్తీ చేసిన టీ వల్ల ఆరోగ్య ప్రమాదాలు వస్తాయని కూడా చెబుతుంది.

ఈ కల్తీని నాణ్యమైన ఉత్పత్తులను ఎంచుకోవడం అంటే టాటా టీ జెమినీ లాంటి నమ్మకమైన బ్రాండ్‌ ఉత్పత్తులను ఎంచుకోవడం ద్వారా నివారించవచ్చు.టీ ప్రేమికులు కల్తీ వల్ల కలిగే నష్టాలను గుర్తించి, తమ ఆరోగ్యం, శ్రేయస్సు కోసం ఆరోగ్యవంతమైన ఎంపికలను చేసుకోవాల్సి ఉంటుంది’’ అని అన్నారు.

ప్రజలకు సురక్షిత ఆహారం లభిస్తుందన్న భరోసా అందిస్తూ ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ఇప్పుడు చల్లటి నీటి పరీక్షను సూచిస్తుంది.ఈ పరీక్ష ద్వారా వినియోగదారులు తమ ప్రాధాన్యతా తేయాకు నాణ్యతను అతి సులభంగా ఇంటి వద్దనే పరీక్షించవచ్చు.

ఈ పరీక్షలో భాగంగా ఓ టేబుల్‌ స్పూన్‌ తేయాకుకు ఓ గ్లాసెడు చల్లటి నీళ్లు లేదంటే గోరు వెచ్చటి నీరు జోడించి స్ధిరంగా తిప్పడం ద్వారా నీటి రంగు మారడం చూడవచ్చు.ఒకవేళ టీ లో కల్తీ జరిగితే అంటే కృత్రిమ రంగులు కలిపితే, నీటి రంగు తక్షణమే మారుతుంది.

ఈ సరళమైన పరీక్షతో తేయాకు ప్రియులు తాము తాగే టీ నాణ్యత పరీక్షించుకోవచ్చు.

సహజసిద్ధమైన మరియు సురక్షితమైన పదార్థాల పట్ల అవగాహనను మహమ్మారి తీసుకురావడంతో పాటుగా వెల్‌నెస్‌, రోగ నిరోధక శక్తి పెంచే ఆహారాల ప్రాధాన్యత కూడా పెంచింది.

అయినప్పటికీ మనం తాగే టీ నాణ్యత కలిగిన స్వచ్ఛమైన టీ మాత్రమే కావడం కీలకం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube