మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న టాప్ డైరెక్టర్ లలో కొరటాల శివ ఒకరు.ఈయన మొదటి నుండి అందరి కంటే డిఫెరెంట్ గా సినిమాలు చేస్తూ వరుస విజయాలు సాధించాడు.
ఈయన సామజిక అంశాలను ప్రధానంగా తీసుకుని దానికి కమర్షియల్ హంగుల్ని జోడించి తెరకెక్కిస్తూ ఉంటాడు.ఈయన మొదటి సినిమా నుండి ఇప్పటి వరకు ప్రతి సినిమాలో ఒక సామాజిక అంశాన్ని తెరమీదకు తెస్తూ ఉంటాడు.
అయితే మెగా హీరోలతో చేసిన సినిమా మాత్రం ప్లాప్ అయ్యింది. చిరంజీవి, రామ్ చరణ్ తో కలిసి చేసిన ఆచార్య సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొడతాసు అని అంతా అనుకున్నారు.
కానీ ఆచార్య విషయంలో మాత్రం పూర్తిగా విఫలం అయ్యాడనే వార్తలు వచ్చాయి.ఇక అవన్నీ మరచి ఇప్పుడు కొరటాల నెక్స్ట్ సినిమాపై ఫోకస్ చేసినట్టు అనిపిస్తుంది.
ఎన్టీఆర్ తో తన నెక్స్ట్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన విషయం విదితమే.మరి కొద్దీ రోజుల్లోనే ఈ సినిమా రెగ్యురల్ షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నారు.
యువ సుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ బ్యానర్ లపై ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో నిర్మించబోతున్నారు.ఇటీవలే ఎన్టీఆర్ 30 నుండి మోషన్ పోస్టర్ రిలీజ్ చేయగా దానికి భారీ రెస్పాన్స్ వచ్చింది.
కొరటాల ప్లాప్ వచ్చిందనే పట్టుదలతో మరింత ఫోకస్ పెట్టారు.
మరి ఎన్టీఆర్ తో చేసే సినిమా హిట్ అయితే మరొక స్టార్ హీరో అవకాశం ఇస్తాడు అనే వార్తలు ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్నాయి.పుష్ప సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు అల్లు అర్జున్.ఈ సినిమా ఇచ్చిన స్టార్ డమ్ తో అల్లు అర్జున్ పేరు మారుమోగిపోతుంది.
పుష్ప 2 షూటింగ్ స్టార్ట్ చేయడానికి ప్రెజెంట్ సుకుమార్ అన్ని సన్నాహాలు చేస్తున్నాడు.
అయితే అల్లు అర్జున్ పుష్ప సినిమాకంటే ముందు అల్లు అర్జున్, కొరటాల కాంబోలో ఒక సినిమా ప్రకటించారు.#AA21 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమాను ప్రకటించారు.కానీ ఇది మాత్రం పట్టాలెక్క లేదు.
పుష్ప రెండు పార్టులు తెరకెక్కిన తర్వాత ఈ సినిమా ఉంటుంది అని అనుకున్నారు.కానీ ఆచార్య పరాజయంతో ఈ సినిమా విషయంలో బన్నీ వెనక్కి తగ్గదు.
ఇక ఇప్పుడు ఎన్టీఆర్ తో చేసే సినిమా హిట్ అయితేనే అల్లు అర్జున్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది.