'#AyyaThathaEvadTelvadhu' హ్యాష్ ట్యాగ్ పెట్టి నెట్టింట రచ్చ రచ్చ చేస్తున్న విజయ్!

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా లైగర్.ఈ సినిమాలో లైగర్ కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటిస్తుంది.

 Vijay Devarukonda Tweet On Social Media Goes Viral-TeluguStop.com

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ మొదటిసారి పాన్ ఇండియా సినిమాలో నటిస్తుండడంతో ఈ సినిమా కోసం దేశ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఎదురు చూస్తున్నారు.లైగర్ సినిమా రిలీజ్ అవ్వకుండానే విజయ్ పాన్ ఇండియా వ్యాప్తంగా భారీ క్రేజ్ సొంతం చేసుకున్నాడు.

ఇక రిలీజ్ దగ్గర పడుతుండడంతో ఇటీవలే ఈ సినిమా నుండి థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేసారు.ఈ ట్రైలర్ లాంచ్ వేడుకలో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ చేసిన కొన్ని వ్యాఖ్యలు నేపోటిజానికి దారితీసిన విషయం విదితమే.

ఈ ఈవెంట్ లో విజయ్ ఫ్యాన్స్ ను ఉద్దేశిస్తూ మాట్లాడుతూ.తండ్రి ఎవరో తెలియదు.తల్లి ఎవరో తెలియదు.అయినా కూడా ఇంత అభిమానం చూపిస్తున్నారు అంటూ చేసిన వ్యాఖ్యలు వివాదానికి తెర తీశాయి.

ఈ వ్యాఖ్యలు తాతలు తండ్రులు పేర్లు చెప్పుకొని వచ్చిన హీరోల ఫ్యాన్స్ ను హార్ట్ చేసాయి.వారిని ఉద్దేశించే ఈయన ఆ వ్యాఖ్యలు చేసారని వార్తలు వచ్చాయి.

కానీ కొంత మంది మాత్రం విజయ్ కావాలని అనలేదు అంటూ ఆయనను సపోర్ట్ చేసారు.ఇక ఇప్పుడు పెట్టిన ట్వీట్ చూస్తుంటే ఈయన కావాలనే వివాదాన్ని రేపుతున్నట్టు అనిపిస్తుంది.

Telugu Ananya Pandey, Karan Johar, Liger, Liger Trailer, Puri Jagannadh, Vijayde

తాజాగా విజయ్ దేవరకొండ ట్విట్టర్ వేదికగా మరొక ట్వీట్ చేసి ఈ వివాదం చల్లారుతుంది అని అనుకునే లోపే మళ్ళీ రేగేలా చేసారు.‘#AyyaThathaEvadTelvadhu’ హ్యాష్ ట్యాగ్ పెట్టి నెట్టింట రచ్చ రచ్చ అయ్యేలా చేస్తున్నాడు.ఇలా వివాదాన్ని రేపి లైగర్ సినిమా ప్రొమోషన్స్ ను చేస్తున్నాడు అంటూ మరికొంత మంది చెప్పుకొస్తున్నారు.ఏది ఏమైనా ఈ వివాదాలు లైగర్ కు చాలా హెల్ప్ అవుతున్నాయనే చెప్పాలి.

ఇక ఈ సినిమాను ఆగస్టు 25న పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ చేయనున్నారు.హై వోల్టేజ్ స్పోర్ట్స్ డ్రామా గా తెరకెక్కిన ఈ సినిమాను పూరీ కనెక్ట్స్ ఇంకా ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube