ఎర్రగా నిగనిగలాడుతూ అందంగా, ఆకర్షణీయంగా కనిపించే యాపిల్ పండు. రుచి విషయంలోనూ భేష్ అనే చెప్పాలి.
అలాగే యాపిల్ పండు బోలెడన్ని పోషకాలను కలిగి ఉంటుంది.అందుకే యాపిల్ డైట్‌లో ఉంటే ఎన్నో ఆరోగ్య లాభాలు లభిస్తాయి.
వివిధ రకాల జబ్బులు దరి చేరకుండా ఉంటాయి.అలాగే చర్మానికి సైతం యాపిల్ పండు ఉపయోగపడుతుంది.
ఇంట్లో యాపిల్ పండ్లు ఉండే తమ స్కిన్‌ను వైట్‌గా, బ్రైట్‌గా మార్చుకోవచ్చు.అసలింతకీ యాపిల్‌ను చర్మానికి ఎలా యూస్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా ఒక యాపిల్ పండును తీసుకుని ఉప్పు నీటితో శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి.ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని సగానికి పైగా వాటర్ పోయాలి.
వాటర్ హీట్ అవ్వగానే అందులో యాపిల్‌ను వేసేసి.పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు ఉడికించాలి.
ఇలా ఉడికించిన యాపిల్‌ను తీసుకుని పై తొక్కను తొలగించి లోపల ఉన్న దానిని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.

ఆ తర్వాత ఈ యాపిల్ ప్యూరీలో వన్ టేబుల్ స్పూన్ ఓట్స్ పౌడర్, వన్ టేబుల్ స్పూన్ పెరుగు, వన్ టేబుల్ స్పూన్ లెమన జ్యూస్, వన్ టేబుల్ స్పూన్ తేనె వేసుకుని అన్నీ కలిసే వరకు మిక్స్ చేసుకుంటే ప్యాక్ సిద్ధం అవుతుంది.దీనిని ఏదైనా బ్రెష్ సాయంతో ముఖం మరియు మెడపై కాస్త మందంగా అప్లై చేసుకుని ఇరవై నుంచి ముప్పై నిమిషాల పాటు వదిలేయాలి.
అనంతరం గోరు వెచ్చని నీటితో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.
ఈ యాపిల్ ఫేస్ ప్యాక్‌ను వారంలో మూడు సార్లు గనుక ట్రై చేస్తే మీ స్కిన్ వైట్‌గా, గ్లోయింగ్‌గా మారుతుంది.చర్మంపై ఎలాంటి మచ్చలు ఉన్నా తొలగిపోతాయి.మరియు డ్రై స్కిన్ నుంచి సైతం ఉపశమనం లభిస్తుంది.