ఎంతోమంది బాలనటులు ముద్దుముద్దుగా డైలాగులు చెబుతూ వారి నటన తో మనల్ని ఎన్నో సినిమాల్లో బాగా అలరించారు.అయితే వాళ్ళ ముద్దు ముద్దు మాటల వెనక చెప్పుకోలేని ఎన్నో బాధలు కష్టాలు ఉన్నాయి అన్న విషయం మీకు తెలుసా? కొంతమంది బాలనటులు సరిగ్గా డైలాగులు చెప్పకపోయినా ఏడిపించే సీన్స్ లో సరిగ్గా ఏడవక పోయినా వారిని పెట్టే బాధ అంతా ఇంతా కాదట.అయితే మనం ఈరోజు చైల్డ్ ఆర్టిస్ట్ గా ఉన్నప్పుడు ఎక్కువగా కష్టాలు అనుభవించిన ఒకప్పటి హీరోయిన్ సారిక ఠాకూర్ గురించి మాట్లాడుకుందాం.ఈమె నటకిరీటి కమల్ హాసన్ గారి రెండో భార్య, అలాగే ఇప్పటి హీరోయిన్ శృతిహాసన్ వాళ్ళ అమ్మగారు.
అంతేకాదు సారిక గారు కూడా ఒకప్పటి హీరోయిన్నే.
ఇక సారిక మరాఠీ రాజపుత్ ఫ్యామిలీ కి చెందిన అమ్మాయి.
అయితే సారిక వాళ్ళ నాన్నగారు తన చిన్నతనంలోనే చనిపోవడంతో కుటుంబ భారం అంతా ఈమె పైనే పడింది.అందుకే చిన్నతనంలోనే చైల్డ్ ఆర్టిస్ట్ గా బాలీవుడ్ లోకి అడుగు పెట్టింది.
అప్పుడు చేతి నిండా సినిమాలతో చాలా బిజీగా ఉండేది.
కానీ ఈమెకి యాక్టింగ్ అంటే ఇష్టం ఉందా లేదా అని అడక్కుండానే సినిమాల్లోకి అరంగేట్రం చేయించింది సారిక వాళ్ళ అమ్మ.అప్పట్లోనే మూడు షిఫ్టుల్లో వివిధ రకాల సినిమాల్లో నటించేదట.ఉదయాన్నే లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకూ సినిమా షూటింగ్ తప్ప ఆమె చిన్నతనంలో ఎటువంటి ఆనందాలకి నోచుకోలేదట.
అలా రోజంతా షూటింగ్ లో పాల్గొని రాత్రి సరిగా నిద్రపోయిందా లేదో కూడా అడక్కుండా సారిక వాళ్ళ అమ్మగారు ఉదయాన్నే లేపి షూటింగ్ కి తీసుకొని వెళ్ళేదట.
అంతేకాదు రోజంతా తనచుట్టూ కెమెరాలు, లైటింగ్, జనాలు, ఆ షూటింగ్ వీటన్నిటితో విసుగెత్తిపోయిన సారిక మొఖం ఏప్పుడు డల్ గా వాడి పోయినట్టుగా ఉండేదట.
ఇక షూటింగ్ స్పాట్ లో సరిగా డైలాగులు చెప్పకపోయినా మారాం చేసినా సారిక వాళ్ళ అమ్మగారు అక్కడికక్కడే బెత్తం తీసుకొని కొట్టేవారట.ఇంకా ఏడవ వలసి వచ్చిన సీన్స్ లో సరిగా ఏడవక పోయినా, కన్నీళ్లు రాకపోయినా, సారిక వాళ్ళ అమ్మ నిర్దాక్షిణ్యంగా కొట్టడమే కాకుండా తనకు ఏడుపు వచ్చేవరకు గట్టిగా గిచ్చేదట.
అంతటితో ఆగకుండా ఎక్కువ తింటే లావు అయిపోతుందని తిండి కూడా సరిగా పెట్టేది కాదట.ఇంకా చైల్డ్ ఆర్టిస్ట్ గా సారికకు ఎక్కువ ఆఫర్స్ రావడంతో వయసు పెరగకుండా ఇంజక్షన్లు కూడా ఇప్పించేదట సారిక వాళ్ళ అమ్మ.అలా చిన్నతనంలోనే తన తల్లి వల్ల సారిక ఎన్నో బాధలను అనుభవించిందట.అయితే తను కొంచెం పెద్దయ్యాక అదే హీరోయిన్ అయ్యాక తన తల్లి నుంచి విడిపోయి కమల్ హాసన్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది.
అయితే సారిక జీవితంలో పెళ్లయ్యాక కూడా ఎటువంటి ఆనందాలు లేకుండా పోయాయి.తన భర్త కమల్ హాసన్ తో వచ్చిన చిన్న చిన్న మనస్పర్ధలు వలన అతను నుండి విడాకులు తీసుకుని ఇప్పుడు ఒక మారుమూల గ్రామంలో ఒంటరిగా నివసిస్తోంది.
ఇక సారిక బిడ్డలైన శృతిహాసన్ అలాగే అక్షర హాసన్ ఇద్దరు హీరోయిన్లు గా బాగా రాణిస్తున్న కూడా తల్లిని అస్సలు పట్టించుకోరట.
అదండి, సారిక గారు వెండి తెర మీద చైల్డ్ ఆర్టిస్ట్ గా, హీరోయిన్ గా ఇంకా ఎన్నో పాత్రల్లో మనల్ని అలరించినా కూడా ఆమె వ్యక్తిగత జీవితం మాత్రం కష్టాలతో కన్నీళ్లతోనే నడిచింది.