ఈ మధ్యకాలంలో చాలామంది ఫిట్నెస్ అనేది బాగా మెయింటైన్ చేస్తున్నారు.ఫిట్నెస్ అనేది ప్రతి ఒక్కరికి కూడా అవసరమైనదే.
అయితే ఫిట్నెస్ నీ కొందరు మాత్రమే అలవర్చుకుంటారు.ఇక మరికొందరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా వారికి సాధ్యం అవ్వదు.
అందుకే కొంతమంది ఫిట్నెస్ కోసం ఫ్లక్స్ సీడ్స్ ను సేవిస్తుంటారు.ఎందుకంటే ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది.
దీని కారణంగా జీవక్రియ మెరుగుపడుతుంది.
అలాగే పెరుగుతున్న బరువు సులభంగా తగ్గిపోతుంది అంతే కాకుండా ఫ్లక్స్ సీడ్స్( Flaxseeds ) లో ఫైటో కెమికల్స్, ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ కూడా ఉంటాయి.
అలాగే ఇవి ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా పనిచేస్తాయి.అయితే ఫ్లక్స్ సీడ్స్ వల్ల ఇన్ని లాభాలే కాదు కొన్ని హాని కలిగించే అనర్ధాలు కూడా ఉన్నాయి.ఎందుకంటే ఫ్లక్స్ సీడ్స్ ను అతిగా తీసుకుంటే అనర్ధాలు కలుగుతాయి.అవిసె గింజలను రోజు అవసరానికి మించి తీసుకుంటే డయేరియా ( Diarrhoea )లాంటి ప్రమాదకరమైన సమస్య వచ్చే అవకాశం ఉంది.

దీంతోపాటు ఇరిటేబుల్ బౌల్స్ సిండ్రోమ్ సమస్య కూడా వచ్చే అవకాశం ఉంది.ఇంకా చెప్పాలంటే ప్రేవుల్లో సమస్య ఉన్నవాళ్లు అవిసె గింజలకు దూరంగా ఉండటం మంచిది.కాబట్టి డైటీషియన్ సలహా మేరకు ఫ్లక్స్ సీడ్స్ ను సేవించాలి.ఇక ఫిట్నెస్ కోసం అవిసె గింజలను రోజు అవసరానికి మించి తింటే ఇది శరీరానికి అలాగే కడుపుకి హాని కలిగిస్తుంది.
దీనివల్ల కడుపు సమస్యలు(Stomach health ) ఎన్నో తలెత్తుతాయి.అవిసె గింజలను మోతాదుకు మించి తీసుకుని నీళ్లు తక్కువగా తాగుతుంటే పేవుల్లో ఆటంకం ఏర్పడుతుంది.

కాబట్టి అవిసె గింజలు ఆరోగ్యపరంగా ఎంత మంచివి అయినప్పటికీ కూడా సరైన మోతాదుకు మించి తీసుకోకూడదు.ఇక అత్యుత్సాహంతో చాలామంది ఎక్కువ మోతాదులో అవిసె గింజలను తీసుకుంటారు.దీంతో ఎలర్జీ సమస్య ( allergy )కూడా ఏర్పడుతుంది.అలాగే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడుతుంది.సాధ్యమైనంత వరకు ఫ్లక్స్ సీడ్స్ తక్కువ మోతాదులోనే తీసుకోవాలి.