గీతాంజలి సినిమా గిరిజ హీరోయిన్ గా అలాగే అమీర్ ఖాన్ హీరోగా ” జో జీతా వహి సికిందర్” అనే సినిమా షూటింగ్ జరుగుతుంది.కానీ ఈ ఈ సినిమా మధ్యలోనే తాను ఇక నటించను అంటూ గిరిజ కోర్టుకెళ్లి మరి ఆమీర్ ఖాన్ ని కోర్టు మెట్లు ఎక్కించింది.
చివరికి గిరిజ ఈ సినిమాతోనే తన కెరియర్ ముగించేసింది.అసలు ఈ సినిమా వెనుక ఏం జరిగింది ? అంతకుముందు గిరిజ జీవితంలో జరిగిన ఆ సంఘటన ఏంటో ఈ ఆర్టికల్ లో చూద్దాం.
బ్రిటిష్ దేశస్తురాలైన గిరిజ ఉన్నత కుటుంబంలో పుట్టి పెరిగింది, చాలా లగ్జరీ లైఫ్ అనుభవించింది.సినిమాల్లో నటించాలన్న కుతూహలం లేదు ఆయన హాలిడేస్ లో ఇండియాకి వస్తే మణిరత్నం కంట్లో పడింది గిరిజ.
ఎలాగైనా తన గీతాంజలి సినిమాలో నటించాలని ఆయన అడగడంతో కథ కూడా నచ్చే గిరిజ ఓకే చెప్పింది.సినిమా ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే.
వాస్తవానికి గిరిజకు ఇలా హత్తుకునే పాత్రలంటే అమితమైన ఇష్టం అందుకే గీతాంజలి లో గీత పాత్రలో ఒదిగిపోయి నటించింది.ఈ చిత్రం తర్వాత గిరిజను వెతుక్కుంటూ అనేక పాత్రలు ఆమె దగ్గరికి చేరగా ముందు కథ చెప్పాలంటు డిమాండ్ చేసేది.
అప్పటి కాలంలో హీరోయిన్స్ కి చాలా తక్కువగా కథలు చెప్పేవారు.అలాగే గిరిజ డిమాండ్స్ ఇండస్ట్రీని ఒకింత షాక్ గురిచేసాయి.అలా తన రెండవ సినిమాగా ఆనందతాండవం అనే ఒక గొప్ప కాన్సెప్ట్ తో సినిమా రాగా అది డిజాస్టర్ గా నిలిచింది.చాలా గొప్ప కాన్సెప్ట్ తో వచ్చిన, హేమాహేమీలు నటించిన చిత్రం ఆడలేదు.

ఇక ఈ సినిమా తరవాత హృదయాంజలి అనే మరో సినిమాలో మాయ పాత్రలో గిరిజ నటించింది ఈ చిత్రం ఏకంగా హిందీ, తెలుగులో నిర్మించగా పుష్కర కాలం తర్వాత ఈ చిత్రం విడుదలైంది.అలాగే ఈ చిత్రానికి అనేక మంది అవార్డు రావడం కూడా విశేషం.ఈ చిత్రానికన్నా ముందే అమీర్ ఖాన్ తో ఓ చిత్రానికి ఒప్పుకున్న గిరిజ సినిమా మొదలైనప్పటి శృంగార సన్నివేశాల్లో నటించడానికి ఒప్పుకోలేదు.అయితే సినిమా మధ్యలోకి వెళ్ళేసరికి మితిమీరిన శృంగారం ఉండేసరికి ఇక నటించను అంటూ ఏకంగా కోర్టుకెళ్ళింది గిరిజ.
దాంతో సినిమా నిర్మాతలు ఆమెకు నష్టపరిహారం చెల్లించి ఆయేషా జుల్కా ని హీరోయిన్ గా తీసుకొని ఆ చిత్రాన్ని విడుదల చేయగా ఈ సినిమాతోనే గిరిజ తన కెరియర్ ని క్లోజ్ చేసుకొని బ్రిటన్ వెళ్ళిపోయింది.







