నాగచైతన్య సమంత విడాకులు తీసుకున్నారు.ఈ విషయం సోషల్ మీడియాలో ఎంతలా హాట్ టాపిక్ గా మారిపోయింది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
చిలక గోరింకల్లా ఒకరిపై ఒకరు అమితమైన ప్రేమాభిమానాలను చూపించుకునే ఇద్దరు ఎందుకు విడిపోయారు అని ఎన్నో రోజుల పాటు సరైన కారణం కోసం ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలో వెతకడం ప్రారంభించారు.ఇక ఎన్నో వార్తలు వచ్చాయి కానీ వీరిద్దరూ విడిపోవడానికి అసలైన కారణం ఏంటి అన్న వార్త మాత్రం రాలేదు.
అయితే చైతన్యతో విడాకుల తర్వాత సమంత సోషల్ మీడియాలో ఎన్నో రకాల పోస్టులు పెట్టింది.అన్ని చైతన్య కోసమే అన్నది నెటిజన్లు చెప్పే మాట.
కానీ అవి ఎవరికోసం అన్నది సమంత కు మాత్రమే తెలుసు.అయితే చైతన్య మాత్రం పూర్తి సైలెంట్.
పెళ్లి కాకముందు పెళ్లి అయిన తర్వాత అదే పంతా కొనసాగిస్తున్నాడు.ఇక విడాకుల తర్వాత కూడా చైతు సైలెంట్ గానే ఉన్నాడు.
విడాకుల ప్రశ్న ఎదురైతే ఇద్దరం బాగుండాలనే ఉద్దేశంతోనే విడాకులు తీసుకుంటామంటూ స్మూత్ గా సమాధానం చెబుతున్నాడు.కానీ సమంత ఇటీవలే కాఫీ విత్ కరణ్ షోలో మావిడాకులు సామరస్యంగా కాలేదని.
మీ ఇద్దరికి ఒక గదిలో ఉంచితే కత్తులు గట్రా దాచాల్సిందే అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.దీంతో వీరు విడాకుల వ్యవహారం మరోసారి తెరమీదకు వచ్చింది.

ఎప్పుడు ఏ షోలో హాజరైన ఎంతో నవ్వుతూ ఒకరిపై ఒకరు ఆప్యాయత చూపించుకునే వీరిద్దరి మధ్య ఇంత శత్రుత్వం ఎప్పుడు ఏర్పడింది.సమంత చెప్పేది నిజమేనా అన్న చర్చ కూడా జరుగుతుంది.అయితే మరో అమల అవుతుంది అనుకున్న సమంత ఎందుకు అక్కినేని కుటుంబంతో ఇమడలేక పోయింది అన్న కూడా చర్చ మొదలైంది.అక్కినేని కుటుంబం మర్యాదలను పట్టించుకోకుండా నాకు ఇష్టం వచ్చినట్టు నేను బతుకుతాను అనుకుంటే సమంత ప్రేమతోనే బ్రేకప్ చెప్పేసి ఉంటే బాగుండేది.

పెళ్లి చేసుకుని రాంగ్ స్టెప్ వేసిందేమో అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు మరికొంతమంది.సమంత ఎన్ని షో లలో తమ విడాకుల గురించి చెప్తున్న నాగచైతన్య కానీ అక్కినేని కుటుంబం గానీ ఎక్కడా స్పందించకుండా మౌనంగా వహించడమే అనే ప్రశ్నలకు సమాధానం హుందాతనం అంటూ మరి కొంతమంది చెబుతున్నారు.







