వైరల్: పాముకి ముద్దులిస్తున్న చిన్నారి.. వణికిపోతున్న నెటిజన్లు!

సోషల్ మీడియాలో పరిధి రోజురోజుకీ పెరుగుతుంది.దాంతో ప్రపంచంలోని వింత వింత విషయాలన్నీ ఒకే తాటిపైకి వస్తున్నాయి.

 Viral A Child Kissing A Snake Netizens Are Trembling , Viral Latest, News Viral,-TeluguStop.com

అయితే అందులో కొన్ని కొన్ని మాత్రం తెగ వైరల్ అవుతుంటాయి.వాటిలో ముఖ్యంగా జంతువులకు, పక్షులకు, చిన్నపిల్లలకు సంబంధించిన వీడియోలు ఎక్కువగా నెటిజన్ల మనసులను దోచుకుంటాయి.

కొన్ని వీడియోలు ఆశ్చర్యాన్ని కలిగిస్తే, మరికొన్ని ఒళ్ళు గగుర్పొడిచేలా ఉంటాయి.మరికొన్ని తెగ నవ్వుని తెప్పిస్తాయి.

అయితే తాజాగా వైరల్ అయినటువంటి వీడియో మాత్రం ఒళ్ళు గగుర్పొడిచేలా వుంది.దాంతో అది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

అవును.ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూస్తే మాత్రం చెమటలు పట్టాల్సిందే.ఈ వైరల్ వీడియోలో ఓ చిన్నారి.ప్రమాదకరమైన పామును ముద్దు పెట్టుకుంటుంది.

అలా చేసిన తర్వాత కూడా ఆమె ఏమాత్రం భయపడకుండా తన నోటిని పదేపదే పాము దగ్గరకు తీసుకెళ్లి దానితో ఊసులు వాడుతుండటం మనం గమనించవచ్చు.ఆ పాము చాలా ప్రమాదకరంగా కనిపిస్తున్నా.

ఆ చిన్నారిలో మాత్రం భయం కనిపించడం లేదు.ఆమె తన నాలుకను బయటకు తీసి పామును ఆటపట్టించడానికి ప్రయత్నిస్తుంది.

ఆ తర్వాత వెంటనే పామును ముద్దాడుతుంది.

ఈ వీడియో నిజంగా షాకింగ్‌గా అనిపిస్తోంది.

ఈ షాకింగ్ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ అయింది.ఇక దీనికి ‘చుమ్మియాన్’ అనే శీర్షికను ఇవ్వడం మనం గమనించవచ్చు.

ఈ వీడియో వేగంగా వైరల్ అవుతోంది.ఈ వీడియో చూసిన వారంతా రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

తల్లిదండ్రులు అలాంటి వాటిని ప్రోత్సహించకూడదని కొందరు హితోపదేశం చేస్తే, మరి కొందరు మాత్రం చిన్నారి ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందేనని కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube