ఒకప్పుడు సినిమాల్లో హీరోల తల్లి పాత్ర చేయాలంటే అందరికీ గుర్తు వచ్చే పేర్లు నిర్మలమ్మ , అన్నపూర్ణమ్మ ఇలాంటి వారి పేర్లు బాగా వినిపించేవి.వీళ్ళ పాత్రలు కూడా సినిమాలో చాలా కీలకంగా ఉండేవి.
అయితే రోజులు మారాయి ఇప్పుడు హీరోలకి తల్లులుగా చేసేవారు మాత్రం చాలా మోడ్రన్ గా ఉన్నారు.కొన్ని సినిమాల్లో హీరోల కంటే చిన్న వయసులో ఉన్న ఆర్టిస్టులు కూడా పెద్ద హీరోలకి తల్లులుగా చేస్తున్నారు.
వారిలో మొదటి వరుసలో ఉండే వారు ప్రగతి.
ప్రగతి చాలా సినిమాల్లో చాలా మంది హీరోలకి హీరోయిన్లకి తల్లిగా యాక్ట్ చేశారు.
మొదట ఏమైంది ఈవేళ సినిమాలో చేసిన తల్లి క్యారెక్టర్ కి మంచి పేరు వచ్చింది.ఆ తర్వాత వచ్చిన డమరుకం బాద్షా, జులాయి వంటి సినిమాల్లో నటించి మంచి నటిగా పేరు తెచ్చుకుంది.
ఇప్పుడు ప్రగతి వయసు 44 సంవత్సరాలు అయిన కూడా ఆమె చాలా ఫిట్ గా ఉంటారు.దానికి కారణం డైలీ యోగ, జిమ్, వ్యాయామాలు చేస్తూ ఉంటారు.
ప్రగతి చిన్నతనంలో ఉన్నప్పుడే వాళ్ల నాన్న చనిపోయారు.దాంతో కుటుంబ భారాన్ని మోయలేక పోతున్న వాళ్ళ అమ్మకి సహాయంగా ఉండడానికి మొదట్లో ఆవిడ ఒక టెలిఫోన్ బూత్ లో కూడా పనిచేశారు.
అదే కాకుండా ఇంకా కొన్ని చిన్న చిన్న పనులు చేస్తూ వాళ్ళ అమ్మకి సహాయం గా ఉన్నారు.కాలేజీ చదువు అయిపోయిన తర్వాత మోడలింగ్ కూడా చేశారు.
అయితే సినిమా ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో తమిళ్ లో హీరోయిన్ గా కూడా ప్రగతి కొన్ని సినిమాల్లో యాక్ట్ చేశారు.హీరోయిన్ గా ఆమె పెద్దగా సక్సెస్ కాలేకపోయారు దాంతో చాలా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తల్లిగా నటించి మంచి పేరుని గుర్తింపుని సంపాదించుకున్నారు ప్రధానంగా చెప్పాలంటే ఆమె దూకుడు సినిమాలో సమంత తల్లిగా నటించి అందరి మన్ననలు పొందారు.
దిల్ రాజు ప్రొడక్షన్ లో వచ్చిన కేరింత సినిమాలో హీరో తల్లిగా నటించి ఒక మంచి తల్లి పాత్రని చేశారు అనే గుర్తింపును కూడా తను సంపాదించారు.ప్రగతి గారు ఒక ఆయన్ని పెళ్లి చేసుకుని కొన్ని రోజులు ఆయనతో ఉన్న తర్వాత వారిద్దరి మధ్య గొడవలు జరిగి ఇప్పుడు భర్త నుంచి విడిగా పిల్లలతో కలిసి ఉంటున్నారు.
ఆమె ఇప్పటికీ జిమ్ చేస్తున్న వీడియో లు అప్పుడప్పుడు నెట్లో పెడుతుంటారు.

సినిమాల్లో మంచి పాత్రలు చేసే ఇంకొక యాక్టర్ సురేఖ వాణి.ఈమె భద్ర, రెడీ, నమో వెంకటేశా లాంటి సినిమాల్లో మంచి క్యారెక్టర్ చేసి మంచి పేరు సంపాదించుకుంది.సురేఖ వాణి సురేష్ తేజ్ అనే అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అయితే ఇంట్లో వారు పెళ్లికి అంగీకరించలేదు.
అయిన కూడా ఇంట్లో నుంచి బయటకు వచ్చేసి పెళ్లి చేసుకుని స్వతహాగా వాళ్లు బతుకుతున్నారు వీళ్ళకి ఒక పాప కూడా ఉంది సురేఖ వాణి గారు వాళ్ళ పాప అప్పుడప్పుడు తమ డ్యాన్స్ వీడియోలను నెట్లో పెట్టి ప్రేక్షకులను అలరిస్తారు.ఇటీవల కాలంలో సురేఖ వాణి భర్త కన్నుమూశారు.

సినిమాల్లో మనందరికీ బాగా తెలిసిన ఆర్టిస్టు హేమ గారు ఈమె అసలు పేరు కృష్ణవేణి.మొదట్లో ఈవిడ హీరోయిన్ ఫ్రెండ్ గా కొన్ని సినిమాల్లో చేశారు తర్వాత హీరోయిన్ గా కూడా కొన్ని సినిమాల్లో చేశారు అయితే అప్పుడు ఉన్న హీరోయిన్స్ అయిన రాధా, విజయశాంతి, రాధిక లాంటి వారి నుంచి వచ్చే పోటీని తట్టుకోలేక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేశారు.నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి, అతడు లాంటి సినిమాలతో ఆమె మంచి ఆర్టిస్ట్ గా గుర్తింపు పొందారు.మొదట్లో బ్రహ్మానందం తో శ్రీలక్ష్మి మరియు కోవై సరళ కాంబినేషన్ బాగా వర్క్ అయ్యేడు.
ఆ తర్వాత బ్రహ్మానందం గారి భార్య గా చేసే కామెడీ ఆర్టిస్ట్ తెలుగు లో ఎవరున్నారు అని అనుకున్నప్పుడు హేమ గారైతే బాగుంటారని అని దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తన సినిమా అయినా అతడులో వీరిద్దరి కాంబినేషన్ పెట్టి మనల్ని కడుపుబ్బ నవ్వించారు.హేమ ప్రముఖ కెమెరా మెన్ జాన్ పెళ్లి కూడా చేసుకున్నారు.
వీళ్ళకి నిషా అనే కూతురు కూడా ఉంది.అయితే ఆమె ఇండస్ట్రీ కి రావడానికి శ్రీలక్ష్మి గారే ఆమెకు ఇన్స్పిరేషన్ అని హేమ ఇప్పటికీ చెబుతుంటారు.

తెలుగులో ఇప్పుడున్న యంగ్ హీరోలందరికీ తల్లిగా నటించాలి అంటే ఇండస్ట్రీలో వినపడే ఒకే ఒక్క పేరు పవిత్ర లోకేష్.ఈవిడ అప్పట్లో హీరోయిన్ గా కూడా కొన్ని సినిమాలు చేశారు.హీరోయిన్ గా సక్సెస్ కాలేక పోవడంతో హీరోలకు తల్లిగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేయడం స్టార్ట్ చేశారు.రేసుగుర్రం సినిమాలో అల్లు అర్జున్ కి తల్లిగా నటించి కొడుకుల మీద తమకు ఉండే ప్రేమ ఎలాంటిదో తెలియజేస్తూ చాలా చక్కగా తల్లి అంటే ఇలాగే ఉండాలి అనేంత బాగా యాక్ట్ చేశారు.
మళ్లీ మళ్లీ ఇది రాని రోజు అనే సినిమాలో శర్వానంద్ తల్లిగా నటించారు.తన కొడుకు గోల్ కోసం కష్టపడుతుంటే అతనికి సపోర్ట్ చేసే తల్లిగా నటించి అందరి ప్రశంసలు అందుకున్నారు.
ఇక ఈమె భర్త సుచీన్ద్ర ప్రసాద్ కూడా నటుడే.ఈయన ఎక్కువగా విలన్ రోల్స్ లో నటిస్తుంటారు.వీరికి ఇద్దరు కొడుకులు.
ఇవండీ మన తెలుగు క్యారెక్టర్ ఆక్టస్స్ భర్తల వివరాలు
.