అరికాళ్ళ మంటలు వల్ల రాత్రిపూట నిద్ర ఉండటం లేదా? అయితే ఈ టిప్స్ మీకోసమే!

అరికాళ్ళ మంటలు( Burning Feet ).చాలా మంది ఈ సమస్యతో బాధపడుతుంటారు.

 Effective Home Remedies For Burning Feet! Home Remedies, Burning Feet, Burning F-TeluguStop.com

ముఖ్యంగా రాత్రిపూట అరికాళ్ళ మంటలు తీవ్రంగా మదన పెడుతుంటాయి.దీని కారణంగా సరైన నిద్ర కూడా ఉండదు.

నిప్పులో కాలు పెట్టినట్లుగా పాదాలు మండిపోతున్నాయి అంటే శరీరంలో ఏదో సమస్య ఉందని అర్థం. డయాబెటిస్, థైరాయిడ్, పోషకాల కొరత తదితర కారణాల వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది.

ఏదేమైనా ఇప్పుడు చెప్పబోయే చిట్కాలు పాటిస్తే చాలా సులభంగా అరికాళ్ళ మంటలు సమస్య నుంచి విముక్తి పొందవచ్చు.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ చిట్కాలు ఏంటో తెలుసుకుందాం పదండి.

నల్ల జీలకర్ర ( Black- umin )అరికాళ్ళ మంటలను నివారించడానికి అద్భుతంగా సహాయపడుతుంది.వన్ టేబుల్ స్పూన్ నల్ల జీలకర్రను ఒక గ్లాస్ వాటర్ లో మరిగించి గోరువెచ్చగా అయిన తర్వాత సేవించాలి.

ఇలా రోజు చేస్తే‌ మధుమేహం అదుపులో ఉంటుంది.అదే సమయంలో అరికాళ్ళ మంటలు దూరం అవుతాయి.

అలాగే అల్లం కూడా అరికాళ్ళ మంటలు సమస్యను నివారించగలదు.ఒక బౌల్‌ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు కొబ్బరి నూనె, రెండు టేబుల్ స్పూన్లు అల్లం రసం వేసి బాగా మిక్స్ చేయాలి.ఈ మిశ్రమాన్ని అరికాళ్ళకు అప్లై చేసుకోవాలి.ఇలా చేస్తే మంటలు తగ్గి అరికాళ్ళు చల్లబడతాయి.

అరికాళ్ళు బాగా మంట పుడుతున్నప్పుడు ఐస్ వాటర్ లో పాదాలను కొన్ని నిమిషాల పాటు ఉంచాలి.ఇది తక్షణ ఉపశమనాన్ని అందిస్తుంది.ఇక యాపిల్ సైడర్ వెనిగర్ తో కూడా అరికాళ్ళ మంటలు సమస్యను నివారించుకోవచ్చు.అందుకోసం బకెట్ సగానికి గోరువెచ్చని నీటిని తీసుకుని అందులో మూడు టేబుల్ స్పూన్లు ఆపిల్ సైడర్ వెనిగర్ ను( Apple cider vinegar ) వేసి మిక్స్ చేసి పాదాలను అందులో పది నుంచి పదిహేను నిమిషాల పాటు నానబెట్టాలి.

ప్రతిరోజు ఇలా చేస్తే సమస్యను పరిష్కారం అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube