మడమ నొప్పి.స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా ఎందరినో వేధించే సమస్య ఇది.
మడమ నొప్పితో బాధ పడే వారు నేలపై కాలు పెట్టాలంటేనే ఎంతో ఇబ్బందిగా మరియు అసౌకర్యంగా ఫీల్ అవుతుంటారు.మడమ వద్ద ఉండే ఎముక ఒత్తిడికి గురవుతుంది.
అందువల్లే, మడమనొప్పి ఏర్పడుతుంది.ముఖ్యంగా వయసు పైబడిన వారిలో ఈ మడమ నొప్పి సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది.
ఈ నొప్పిని నివారించుకునేందుకు పెయిన్ కిల్లర్స్ వాడుతుంటారు.
కానీ, పెయిన్ కిల్లర్స్ ఆరోగ్యానికి ఏ మాత్రం మంచివి కాదు.అయితే న్యాచురల్ పద్ధతుల్లోనూ మడమ నొప్పికి చెక్ పెట్టవచ్చు.ఆ టిప్స్ ఏంటో లేట్ చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.మడమ నొప్పిని తగ్గించడంలో ఆముదం అద్భుతంగా సహాయ పడుతుంది.ఒక బౌల్లో ఆముదం వేసి వేడి చేయాలి.
ఇప్పుడు దీనిని గోరు వెచ్చగా అయిన తర్వాత మడమకు అప్లై చేసి కాసేపు మసాజ్ చేసుకోవాలి.ఇలా తరచూ చేస్తే క్రమంగా మడమ నొప్పి మాయం అవుతుంది.
అలాగే మడమ నొప్పితో ఇబ్బంది పడే వారు అల్లాన్ని డైట్లో చేర్చుకోవాలి.ఎందుకంటే, అల్లంలో నొప్పి నివారించే లక్షణాలు పుష్కలంగా ఉంటాయి.
అందుకే అల్లం టీ లేదా అల్లాన్ని ఏదో విధంగా తీసుకుంటే.మగమ నొప్పి తగ్గు ముఖం పడుతుంది.
అయితే మంచిది కదా అని అతిగా మాత్రం అల్లాన్ని తీసుకోరాదు.
బేకింగ్ సోడాతో మడమ నొప్పికి చెక్ పెట్టవచ్చు.
ముందుగా ఒక బౌల్ తీసుకుని.అందులో ఒక స్పూన్ బేకింగ్ సోడా మరియు వాడర్ వేసి బాగా మిక్స్ చేయాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మడమలకు అప్లై చేసి.అర గంట పాటు వదిలేయాలి.
అనంతరం గోరు వెచ్చని నీటితో పాదాలను క్లీన్ చేసుకోవాలి.ఇలా చేసినా మడమ నొప్పి నుంచి ఉపశమనం పొందుతారు.