ఆడవాళ్ళ‌ డైట్ లో కచ్చితంగా ఉండాల్సిన లడ్డూ ఇది..!

ప్రతి దశలోనూ శారీరకంగా, మానసికంగా ఆడవారు ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటారు.వాటిని తట్టుకుని నిలబడాలంటే కచ్చితంగా ప్రత్యేకమైన డైట్ మెయింటైన్(Diet Maintain) చేయాలి.

 This Is A Laddu That Must Be In The Diet Of Women! Women, Health, Health Tips, G-TeluguStop.com

పోషకాహారాన్ని తీసుకోవాలి.ముఖ్యంగా ఆడవారి డైట్ లో కచ్చితంగా ఉండాల్సిన లడ్డూ ఒకటి ఉంది.

ఆ లడ్డూను ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.? దాని ప్రయోజనాలు ఏంటి.? అన్న విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని ఒక కప్పు నువ్వులు, ఒక కప్పు అవిసె గింజలు(Flax seeds), ఒక కప్పు బాదం గింజలు(Almonds) విడివిడిగా వేయించి పెట్టుకోవాలి.

ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకుని అందులో వేయించి పెట్టుకున్న నువ్వులు, అవిసె గింజలు(Sesame ,flax seeds) మరియు బాదం వేసి కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న పొడిలో ఫ్రెష్ గా తయారు చేసిన బెల్లం సిరప్ మరియు వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసి బాగా మిక్స్ చేసి లడ్డూల మాదిరి చుట్టుకోవాలి.

ఆడవారి ఆరోగ్యానికి ఈ లడ్డూలు ఒక వరం అనే చెప్పుకోవచ్చు.

Telugu Almonds, Flax Seeds, Flaxseeds, Tips, Healthy Laddu, Latest, Sesame Seeds

రోజుకు ఒకటి చొప్పున ఈ లడ్డూను నిత్యం కనుక తీసుకుంటే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారు.బాదం, నువ్వులు, అవిసె గింజల్లో(Almonds, sesame seeds, flax seeds) ప్రోటీన్ మరియు ఆరోగ్యకరమైన కొవ్వులు మెండుగా ఉండ‌టం వ‌ల్ల ఈ ల‌డ్డూ శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది.నీర‌సం, అల‌స‌ట ద‌రిదాపుల్లోకి రాకుండా అడ్డుక‌ట్ట వేస్తుంది.

అలాగే ఒమేగా-3, ఒమేగా-6 ఫ్యాటీ ఆమ్లాలు, జింక్ వంటి ఖ‌నిజాల‌ను క‌లిగి ఉండే ఈ ల‌డ్డూ మహిళల్లో ఫెర్టిలిటీ రేటును పెంచుతాయి.హార్మోన్ల సమతుల్యతకు స‌హాయ‌ప‌డ‌తాయి.

Telugu Almonds, Flax Seeds, Flaxseeds, Tips, Healthy Laddu, Latest, Sesame Seeds

మ‌హిళ‌ల్లో త‌లెత్తే కామ‌న్ స‌మ‌స్య ర‌క్త‌హీన‌త‌.అయితే శ‌రీరానికి స‌రిప‌డా ఐర‌న్ ను అందించి ర‌క్తహీన‌త‌కు చెక్ పెట్ట‌డంలో ఈ ల‌డ్డూ హెల్ప్ చేస్తుంది.నువ్వులు, అవిసె గింజ‌లు, బాదంలో కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ అధికంగా ఉండటం వ‌ల్ల ఈ ల‌డ్డూ ఎముక‌ల‌ను దృఢంగా మారుస్తుంది.కీళ్ల నొప్పుల బారిన ప‌డ‌కుండా ర‌క్షిస్తుంది.

అంతేకాకుండా ఈ ల‌డ్డూ బ్లడ్ షుగర్ లెవల్స్‌ని నియంత్రించడంలో, జీర్ణ ప్రక్రియను మెరుగుప‌ర‌చ‌డంలో, గుండె సంబంధిత సమస్యలు వ‌చ్చే రిస్క్ ను త‌గ్గించ‌డంలోనూ స‌హాయ‌ప‌డుతుంది.మ‌రియు ఈ లడ్డూ చర్మానికి మరియు జుట్టుకు కూడా ఎంత‌గానో మేలు చేస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube