తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటున్నారు.మరిలాంటి సందర్భంలోనే తమదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు సాగుతున్నారు.
ఇక నట వారసులు సైతం ఇండస్ట్రీకి రావడం వాళ్ళకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడం అనేది చకచకా జరిగిపోతున్నాయి.ఇలాంటి సందర్భంలోనే రైటర్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas) ఆ తర్వాత దర్శకుడిగా మారి మంచి సినిమాలను చేసిన విషయం మనకు తెలిసిందే.
మరి ఈ సినిమాల ద్వారా ఆయన మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.
అయితే ఇప్పుడు తన కొడుకును సైతం హీరోగా ఎంట్రీ ఇవ్వాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది.
ఇక సందీప్ రెడ్డివంగ (Sandeep Reddy Vanga)డైరెక్షన్ లో ఆయన ఒక సినిమా చేయాలని అనుకుంటున్నాడట.మరి దానికి సందీప్ ఒప్పుకున్నాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.
ఇక ఏది ఏమైనా కూడా త్రివిక్రమ్ కొడుకుకి సందీప్ రెడ్డి వంగ అంటే చాలా ఇష్టమట.ఆయన తీసే సినిమాలు గాని ఆయన మేకింగ్ స్టైల్ గాని అవన్నీ తనకు నచ్చడంతో ఒకవేళ హీరోగా చేస్తే సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ (Directed by Sandeep Reddy Vanga)లో చేస్తానని త్రివిక్రమ్ తో చెప్పారట.

ఈ విషయాలన్నీ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉంది అనే విషయాలు తెలియదు గాని సందీప్ రెడ్డి తనకు చాలా ఇష్టం అంటూ కొన్ని వార్తలైతే వైరల్ అవుతున్నాయి.మరి ఏది ఏమైనా కూడా త్రివిక్రమ్ కొడుకుతో సందీప్ రెడ్డి వంగ సినిమా ఉంటుందా? లేదా అనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…ఒక వేళ అంటే మాత్రం అది నెక్స్ట్ లెవల్లో ఉంటుందట…