ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలందరు వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి అహర్నిశలు ప్రయత్నమైతే చేస్తున్నారు.నందమూరి ఫ్యామిలీ నుంచి సీనియర్ ఎన్టీఆర్ తర్వాత బాలయ్య బాబు(Nandamuri Family, Senior NTR, Balayya Babu) ఆ ఫ్యామిలీ బాధ్యతను పుణికి పుచ్చుకొని ఇండస్ట్రీలో స్టార్ హీరోగా వెలుగొందుతూ ముందుకు దూసుకెళ్తున్నాడు.
మరి ఇలాంటి సందర్భంలోనే నందమూరి ఫ్యామిలీ (Nandamuri Family)నుంచి మూడోవతరం హీరోగా జూనియర్ ఎన్టీఆర్ (Junior NTR)వచ్చినప్పటికి బాలయ్య బాబు కొడుకు అయిన మోక్షజ్ఞ (Mokshagna)ఎంట్రీ కోసం ప్రతి ఒక్కరు ఎదురుచూస్తున్నారు.మరి ఏది ఏమైనా కూడా మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందా లేదా అనే విషయాల మీద సరైన క్లారిటీ అయితే రావడం లేదు.

ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు వాళ్ల వారసులను ఇండస్ట్రీకి ఎంట్రీ ఇప్పిస్తున్న నేపథ్యంలో మోక్షజ్ఞ ఎంట్రీ (Mokshagna entry)ఈ సంవత్సరం కూడా ఉండే విధంగా కనిపించడం లేదంటూ కొన్ని వార్తలైతే వస్తున్నాయి.మరి వాటికి అనుగుణంగానే మోక్షజ్ఞ సినిమా ఉంటుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.మరి ఏది ఏమైనా కూడా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో చేయబోతున్న సినిమా మీద క్లారిటీ అయితే రావడం లేదు.ఈ సినిమా ఉండకపోతే మాత్రం మోక్షజ్ఞ కోసం మరో దర్శకుడుని వెతకాల్సిన అవసరమైతే ఉంద.మరి ఇదే కనక జరిగితే మోక్షజ్ఞ ఎంట్రీ ఈ సంవత్సరం కూడా ఉండదు అనేది స్పష్టం గా తెలుస్తుంది.

మరి ఏది ఏమైనా కూడా ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్న బాలయ్య బాబు కొడుకును ఇంట్రడ్యూస్ చేయడంలో మాత్రం ఎందుకు ఇంత లేట్ చేస్తున్నాడు అంటూ తెలుగు సినిమా ప్రేక్షకులతో పాటు నందమూరి ఫ్యామిలీ అభిమానులు సైతం ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు…చూడాలి మరి ఆయన సినిమా ఎప్పుడు చేస్తారు అది ధియేటర్లు ఎప్పుడు వస్తుంది అనేది…
.







